Type Here to Get Search Results !

Sports Ad

బషీరాబాద్ లోని మత్తుమందు పట్టుకున్న అధికారులు


మత్తుమందు పట్టుకున్న ఎక్సయిజ్ అధికారులు
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం లోని మైల్వర్ గ్రామం యందు తెలంగాణ కర్ణటక సరిహద్దు ఉండడంతో అక్కడ పోలీస్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేయగా కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా తరలిస్తున్న సుజుకి ఎర్టిగా కఎ32డి7216 వాహనాన్ని అపి వివరాలు అడిగి వాహనాన్ని తనిఖీ చేయగా దానిలో ఉన్న 290 కేజీల (CH) క్లోరల్ హైడ్రెట్నో సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్న ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య ఆధ్వర్యంలో మరియు సీఐ శ్రీధర్, ఎస్ఐ కుర్మనాయక్ లు కలిసి ఉదయం 9:45 నిమిషాలకు పట్టుకోవడం జరిగింది .శివరాములు s/o తుల్జయ్య కళాబుర్గి రాష్ట్రం సెడం లోని బనూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అదుపులోకి తీసుకొని తాండూర్ ఎక్సయిజ్ సీఐ తుక్యా నాయక్ కు అప్పగించారు. ఎస్ఐ విష్ణు, కానిస్టేబుల్ కిషన్ రావు, సుధాకర్, శ్రీశైలం, ప్రవీణ్ కుమార్ లు ఉన్నారు. 

12 మంది లబ్ధదారులకు  సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన MLA

  •  రూ.4 లక్షల 5 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.

తాండూరు : తాండూరు లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ఈరోజు బషీరాబాద్ మండలానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు రూ.4 లక్షల 5 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. బషీరాబాద్ మండల కేంద్రానికి చెందిన తస్లీమ బేగం కు రూ.1,50,000, ఎక్మై గ్రామానికి చెందిన శేఖర్ కు రూ.1,00,000, గోటిగా కుర్ధు గ్రామానికి చెందిన రేవంత్ కు రూ.1,00,000, కంసన్ పల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్య గౌడ్ కు రూ. 55,000 ఎమ్మెల్యే అందజేశారు.

అదేవిదంగా 8 మంది లబ్ధదారులకు రూ.9 లక్షల 80 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. తాండూరు నియోజకవర్గానికి చెందిన 8 మంది లబ్ధిదారులకు రూ.9 లక్షల 80 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. బషీరాబాద్ మండల కేంద్రానికి చెందిన తస్లీమ బేగం కు రూ.1,50,000, ఎక్మై గ్రామానికి చెందిన శేఖర్ కు రూ.1,00,000, గోటిగా కుర్ధు గ్రామానికి చెందిన రేవంత్ కు రూ.1,00,000, కంసన్ పల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్య గౌడ్ కు రూ. 55,000, తాండూరు మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ కు రూ.2,50,000, చిట్టిఘనాపూర్ గ్రామానికి చెందిన మహాదేవి కి రూ.1,00,000, పెద్దేముల్ మండలం అత్కూర్ తాండకు చెందిన శోబారానికి రూ.1,00,000, యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన చిన్నమాలకు రూ.1,25,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. సిఎంఆర్ఎఫ్ సహాయం కావలసినవారు తన క్యాంప్ కార్యాలయంలో సంప్రదించాలని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపనర్సింలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పు, తాండూర్ మండల అధ్యక్షులు రాందాస్, బషీరాబాద్ మండల అధ్యక్షులు రాము నాయక్, పెద్దేముల్ మండల అద్యక్షులు కోహిర్ శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్, నర్సింలు, శ్రీనివాస్ చారి, రాజు గౌడ్, డైరెక్టర్లు ఆశన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమంలో దేశానికి దిక్సూచి తెలంగాణ రాష్టం

వానకాలంలో వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తాం

గోనే సంచులు కోసం రైతులు ఎలాంటి ఇబ్బందులు పడనవసరం లేదు

తాండూరు : రైతు సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్టం నిలిచిందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం  తాండూరు పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే... మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు ఉచితంగా 24గంటల కరెంటు, సాగు నీరు, సబ్సిడీ, రైతు బంధు, రైతు భీమా లాంటి ఎన్నో కనివిని ఎరుగని రీతిలో రైతులకు సంక్షేమాన్ని అందిస్తూ దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు. వానకాలం వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వేల్లడించారు. గ్రామాల్లో ఏఈవోల సాయంతో వరి పండించిన రైతుల వివరాలను సేకరించి, దానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలులో సజ్జరుస్తరన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేవిదంగా అధికారులు పర్యవేక్షింస్తరన్నారు. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చే రైతుల అకౌంట్ లో డబ్బులు జమచేయడానికి ఆధార్, బ్యాంక్ వివరాలు సక్రమంగా ఇస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా రైతుల అకౌంట్ లోనే నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి కేంద్రం వద్ద కరోనా నిబంధనలు పాటించాలని, రైతులు ఒకే దగ్గర గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపనర్సింలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పు, తాండూర్ మడల అధ్యక్షులు రాందాస్ బషీరాబాద్ మండల అధ్యక్షులు రాము నాయక్, పెద్దేముల్ మండల అద్యక్షులు కోహిర్ శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్, నర్సింలు, శ్రీనివాస్ చారి, రాజు గౌడ్, డైరెక్టర్లు ఆశన్న, సప్తగిరి, మల్లప్ప, భీమ్ రెడ్డి, ఇర్ఫాన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.


రోగులను పరామర్శించిన MLA
తాండూర్ పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలోని దాదాపు 50 కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు.  తాండూర్ మున్సిపల్ పరిధిలో నుండి అధిక సంఖ్యలలో ఉండడం చూసి డాక్టర్లు కలుషిత నీరే కారణం అన్నారు.అనంతరం  పాత తాండూరులో కలుషిత నీరు తాగి అనారోగ్యానికి గురై తాండూరు జిల్లా ఆస్పత్రిలో చేరిన వారిని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పరామర్శించరు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశించారు.జిల్లా ఆసుపత్రిలో ఉన్న వైద్యులకు పరామశించి ధైర్యాన్ని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపనర్సింలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పు పార్టీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.


కరన్ కోట్ నూతన ఎస్ఐ గా మధుసూధన్ రెడ్డి

తాండూర్ మండల కరన్ కోట్ నూతన ఎస్ఐ గా మధుసూధన్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఇక్కడ పని చేస్తున్న ఏడుకొండలు బదిలీ అయ్యారు.గద్వాల్ లో పని చేస్తున్న ఎస్ఐ గా మధుసూధన్ రెడ్డిని కరన్ కోట్ నూతన ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించి,మాట్లాడుతూ ప్రజలందరూ శాంతి భద్రతల విషయంలో సహకరించాలని తెలిపారు.

యాలల నూతన ఎస్ఐ గా శంకర్
యాలల మండల నూతన ఎస్ఐ గా శంకర్ పదవి బాధ్యతలు స్వీకరించరు. గతం లో ఇక్కడ పనిచేసిన సురేష్ బదిలీ పై వెళ్లారు. నూతన ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన శంకర్ శాంతి బాధత్రాల విషయం లో ప్రజలు సహకరించాలని కోరారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies