Type Here to Get Search Results !

Sports Ad

నావంద్గి సోసిటీలో కొనుకోలు కేంద్రం ప్రారంభం



నావంద్గి సోసిటీలో కొనుకోలు కేంద్రం ప్రారంభం
బషీరాబాద్ : బషీరాబాద్ మండల కేంద్రంలో నావంద్గి సోసిటీ లో కొనుగోలు కేంద్రం ప్రారంభించిన కోపరేటివ్ చైర్మన్ వెంకట్ రాం రెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్  మాట్లాడుతూ బలంగానమ్మే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు రైతుల పాలిట దేవుడు అని అన్నారు. రైతుల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా రైతులను రాజుగా చేయాలనీ సంకల్పంతో రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరలకు కొంటాము,వారి ధాన్యానికి మద్దతు ధరకి  ఏ గ్రేడ్ కు రూ 1960/- గ్రేడ్ బీకి రూ 1940/- తేమ శాతం 17% లోపు ఉండేటట్టుగా చేసి వ్యవసాయ అధికారుల దగ్గర టోకెన్ ప్రకారం కేటాయించిన రోజే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రనికి తీసుకొని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ తహసీల్దార్ వీరేశం బాబు, నవీన్ రెడ్డి, కోపరేటివ్ బ్యాంకు సిబ్బంది సీఐఓ వెంకటయ్య రాజశేఖర్, దమర్చేడ్ కొనుగోలు కేంద్రంలో సర్పంచులు నర్సిరెడ్డి, శివనాయక్, తెరాస పార్టీ అధ్యక్షులు రాము నాయాక్, నర్సిరెడ్డి, మోహన్ సింగ్, కిష్టప్ప,  ఫరూక్, బంధ్యయ్య తుకారాం పలు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.


నాపరతి గనులపై మైనింగ్ అధికారుల దాడులు
  •  నాపరాళ్ల కోత యంత్రల నుండి 4 బ్లేడులు స్వదినం
  •  అనుమతులు లేకుండా తవ్వకాలు జరగకూడదు
 బషీరాబాద్ : బషీరాబాద్ మండల పరిధిలోని కోర్విచేడ్ నాపరతి గనులలో  ఏలాంటి అనుమతులు లేకుండా నాపరాళ్లు తవ్వకాలు జరుపుతున్న గనుల్లో మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. మైనింగ్ అధికారాలు తెలిపిన వివరాల ప్రకారం బషీరాబాద్ మండల పరిధిలోని కోర్విచేడ్ నాపరతి గనులలో తనిఖీలు నిర్వహించి నాపరతి కోత యంత్రల నుండి 4 బ్లేడ్లను స్వదినం చేసుకున్నట్లు ఏ. డి సంబశివా రావు తెలిపారు.ఎలాంటి అనుమతులు లేకుండా గనులలో తవ్వకాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవున్నారు. కాదని ఎవరైనా తవ్వకాలు నిర్వహిస్తే యంత్రలను సీజ్ చేసి యజమానుల పై చర్యలు తీసుకుంటామన్నారు. కోత యంత్రల నుండి స్వదినం చేసుకున్న బ్లేడ్లను బషీరాబాద్ తహసీల్దార్ వెంకటస్వామికి అప్పగించినట్లు తెలిపారు. మైనింగ్ ఏ. డి తో పాటు టీ. ఏ. రేణుక, నాగలక్ష్మి మైనింగ్ అధికారాలు తదితరులు  ఉన్నారు.


మంత్రి సబితా ఇంద్రరెడ్డి కి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే
 బషీరాబాద్ : బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో టీచర్లు లేక విద్యారులు తమ విద్యా బోధన జరగడం లేదు అని మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు మంత్రి సబితా ఇంద్రరెడ్డి కి వినతి పత్రం అందించారు. మంత్రి సబితా ఇంద్రరెడ్డి పాఠశాలలో ఉన్న సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తామని తొందరలో ఉర్దూ పాఠశాలకు ఉపాధ్యాయులను నియమిస్తాను అని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే తో పాటు మండల కోఆప్షన్ సభ్యుడు రజక సీనియర్ నాయకులు పవన్ కుమార్, ధన్ సింగ్ వార్డ్ మెంబర్ సిధార్థ తదితరులు పాల్గొన్నరు.




ఘనంగా జిల్లా జడ్పి ఛైర్పర్సన్ జన్మదిన వేడుకలు
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం ఎంపీపీ,టీఆరెఎస్ నాయకులు వికారాబాద్ జిల్లా అభివృద్ధి రాతసారధి, జిల్లా పరిషత్ చెర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, జన్మదిన సందర్బంగా వారి నివాసం లో పూలమాల, శాలువాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ వికారాబాద్ జడ్పి ఛైర్పర్సన్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోపరేటివ్ బ్యాంకు చైర్మన్ వెంకట్ రాంరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, జడ్పిటీసీ శ్రీనివాస్ రెడ్డి వైస్ ఎంపీపీ అన్నపూర్ణ, శంకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అనంతయ్య గౌడ్, శ్రీధర్, చందర్, శ్రవణ్ కుమార్, మోహన్, సర్పంచులు ప్రియాంక, రవీందర్, సునీత రాథోడ్, పద్మ బాయ్, విరామణి, శాంతి బాయ్, తదితరులు పాల్గొన్నారు.


మంత్రి కేటీర్ ను కలసిన  తాండూరు నేతలు
  •  ప్రతేక దృష్టి సరిస్తా, సమస్యలు ఉంటే ఎమ్మెల్యే తో చెప్పండి
  •  పదవులు పంపకల్లో న్యాయం చేస్తా, మంత్రి కేటీర్ తో ఎమ్మెల్యే నేతలు భేటీ
  • తాండూర్ అభివృద్ధిని కొరకై  పై ప్రత్యేక దృష్టి
తాండూర్ : వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణ ప్రాంత అభివృద్ధిని నాకు వదిలేయండి అని టీఆరెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీర్ పేర్కొన్నారు. అన్ని పనులను ఏడాదిలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.తాండూరులో జరుగుతున్న అభివృద్ధి పనులపై నాకు పూర్తి అవగాహనా ఉందని అన్నారు. తాండూరులో జరుగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేయడం పై ప్రత్యేక దృష్టి సరిస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల అమలు విషయంలో తాండూరులో ఎం జరుగుతుంది అనేది నాకు పూర్తి సమాచారం ఉందని కూడ మంత్రి కేటీర్ పేర్కొన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తో పాటు తాండూరు నియోజకవర్గంలో  కీలకనేతలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, పార్టీ మేధావి వర్గం ముక్యులు శ్రీశైల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చెర్మన్ విశ్వనాధ్ గౌడ్, మాజీ ఛైర్పర్సన్ సునీత సంపత్ దంపతులు, యువనేత రాజు గౌడ్, హరి గౌడ్ లు మంత్రిని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్బంగా వీరి మధ్య పలు అంశాలపై రచ్చ జరిగింది. ఎప్పుడు అమెరికా వెళ్తున్నారని మాజీ ఎమ్మెల్యే నారాయరావును మంత్రి కేటీర్అడిగి తెలుసుకున్నారు. అమెరికా వెళ్లడం ఆలస్యం అయితే మరో సారి కలవాలని సూచించారు. డాక్టర్ సంపత్ దంపతులతో కూడా మంత్రి కేటీర్ ఆప్యాయంగా మాట్లాడారు. విశ్వనాథ్ గౌడ్ తో మాట్లాడుతూ గౌడ్ గారు ఆరోగ్యం బాగుందా అని పాలకరించారు. యువనేత రాజుగౌడ్ సేవలు పార్టీకి చాలా అవసరం అని మంత్రి కేటీర్ పేర్కొన్నారు. పార్టీ పదవులతో పాటు నియమిత పదవుల భర్తీలో సునీత సంపత్ తో పాటు రాజుగౌడ్ లకు కచ్చితంగా న్యాయం చేయాలనీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోరారు. ఇందుకు మంత్రి కేటీర్ అంగీకరించారు. ఈ సందర్బంగా శ్రీశైల్ రెడ్డి" ఆర్ట్ ఆఫ్ వార్ " అనే పుస్తకం ను మంత్రి కేటీర్ కు అందించారు. అంతకు ముందు బషీరాబాద్ మాజీ ఎంపీపీ కావాలి భాస్కర్ తన సోదరుడి కుమార్తె మేఘనతో మంత్రి కేటీర్ ను కలిశారు. ఇటీవల మేఘన సివిల్ సర్వీస్ లో ఉత్తమ ప్రతిభ చూపించి జాతీయ స్థాయిలో 83 వ ర్యాంక్ సాధించారు. తాండూరు ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమా పథకాలను ప్రజలకు వివరించాలని మంత్రి కేటీర్ నేతలకు సూచించారు. త్వరలో మరోసారి కలిసి ఇతర అంశాలపై విస్కృతంగా చర్చిదామని మంత్రి కేటీర్ తాండూర్ నేతలకు సూచించారు. టీఆరెఎస్ ప్రభుత్వం తాండూరులో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను ఏడాది కాలంలో పూర్తి చేసే విధంగా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు.క్రియాశీలంగా మారిన నేతలతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంత్రి కేటీర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తో పాటు అయన వర్గంకు చెందిన ముఖ్యనేతలు మంత్రి కేటీర్ ను ప్రగతి భావాన్లో కలవడం తాండూరులో రాజకీయ చర్చకు తెరలేపింది. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గం తాండూరు లో బలంగా మారుతోంది. అసంతృప్తి తో పాటు తటస్థంగా ఉన్న అనేక మంది పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంట నడుస్తూ రాజకీయాలలో క్రియాశీలంగా మారారు. ఈ సమావేశంలో తెరాస పార్టీ నేతలు తదితరులు పాల్కొన్నారు. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies