మంతన్ గౌడ్ గ్రామంలో ఆజాదికా అమృత్ మహోత్సవం
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామంలో ఆజాదికా అమృత్ మహోత్సవం నిర్వహించారు.ఈ సందర్బంగా బషీరాబాద్ పిఏచ్సి ఆయుష్ డా.సురేష్ కుమార్ మంతన్ గౌడ్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు స్వచ్ఛత,పరిశుభ్రత,వ్యాయామం,యోగ తదితర అంశాల పై విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అవగాహనా కల్పించారు. డా.సురేష్ కుమార్ వ్యాయామాలు ప్రత్యక్షంగా చేసి చూపించారు.ప్రతి రోజు వ్యాయామం చేయడం వలన శరీరం ధృడంగా ఉండి ఆరోగ్యాంగా ఉంటాం.ప్రతి రోజు పౌష్ఠిక ఆహారం తీసుకోని, 2 లీటర్ల నీళ్లు త్రాగాలి అన్నారు.ఈ యొక్క కార్యక్రమాలలో పాఠశాల హెడ్ మాస్టర్ శేషగిరి,ఉపాధ్యాయులు రాధికా,సంగీత,విజయ లక్ష్మి,ఎఎన్ఎం శ్రీదేవి తదితరులు పాల్కొన్నారు.బషీరాబాద్ మండల తాండలకు నిధులు కేటాయించాలి
బషీరాబాద్ : గిరిజన తాండలకు నిదులు కేటాయించాలని టీఆరెఎస్ పార్టీ సెల్ మండల ఉపాధ్యక్షుడు రాంశెట్టి తాండూర్ ఎమ్మెల్యే రిహిత్ రెడ్డి ని కోరారు గురువారం ఎమ్మెల్యే ను అయన నివాసం లో మర్యాదపూర్వకంగా కలసి చర్చించారు. ఈ సందర్బంగా మండలం లోని గిరిజన తాండలకు అత్యధికంగా నిధులు కేటాయించి అభివృద్ధికి పనులకు ప్రభుత్వం నుండి కేటాయించలని అభివృద్ధికై కృషి చేయాలనీ విజ్ఞప్తి చేశారు.బీసీ అధ్యక్షులు లక్ష్మణ చారి జన్మదిన వేడుకలు
తాండూర్ : జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ను తాండూర్ బీసీ యువనాయకులు మంగళవారం కలిశారు, ఈ కార్యక్రమం లో తాండూర్ బీసీ కన్వీనర్ రాజ్ కుమార్ సీజెస్తున్నటువంటి ఈ సేవ కార్యక్రమలను గురించి బీసీ యువ నాయకులు ఆయనకు వివరించారు. బీసీ ల కోసం ఎల్లవేళలా తాండూర్ బీసీ కన్వీనర్ రాజ్ కుమార్ కు తోడుగా ఉంటామని బీసీ యువ నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా యాలల మండల బీసీ అధ్యక్షులు లక్ష్మణ చారి జన్మదినన్ని జరుపుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఆర్ కృష్ణయ్య సమక్షంలో ఉపాధ్యక్షులు బోయ రాధాకృష్ణ, యాలల మండల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణ చారి, బషీరాబాద్ మండల అధ్యక్షులు నరేందర్, రాము ముదిరాజ్, బస్వరాజ్,తదితరులు పలుకున్నారు.నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్షకు దరఖాస్తు గడువు పొడగింపు
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా నేషనల్ టాలెంట్ సెర్చ్ లెవెల్ - ఎ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే గడువును డిసెంబర్ 2 వరకు పొదగించడమైనది. జిల్లా విద్యా శాఖ అధికారిని రేణుక దేవి ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో జరిగే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ లెవల్ -1 పరీక్ష కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు ఫీజ్ గడువు డిసెంబర్ 2 వరకు పొదగించినట్లు ఆమె తెలిపారు. పదో తరగతి విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులని, ఇందుకోసం విద్యారుల పేర్లను డిసెంబర్ 4 వరకు అందరూ ప్రధానోపాధ్యాయులు రిజిస్టర్ చేయాలనీ సూచించారు.ఈ పరీక్ష జనవరి 2022 న ఉంటుందని తెలిపారు.ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చెసిన దరఖాస్తులతో పాటు ఫీజు , కావాల్సిన డాకుమెంట్స్ జాతపరిచి జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయం లో డిసెంబర్ 6 వ తేదీ వరకు సమర్పించగలరు అని తెలిపారు.