బాధిత కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేత
- ప్రభుత్వం నుండి మంజూరైన రూ.5 లక్షల పరిహారం అందజేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ : బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన పోతురాజు నాగప్ప, లక్ష్మమ్మ దంపతుల కుమారుడు శివ కుమార్ గత ఏడాది డిసెంబర్ లో ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ కు గురై మృతి చెందాడు. కాగా మృతిని తల్లిదండ్రులు మరియు గ్రామస్థులు వారి కుటుంబాన్ని ప్రభుత్వం నుండి ఆదుకోవాలని ఆ సమయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి విన్నవించుకోగా ఎమ్మెల్యే కృషితో విద్యుత్ శాఖ నుండి మృతిని కుటుంబానికి పరిహారం కింద 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. కాగా దానికి సంబంధించిన రూ.5 లక్షల చెక్కును ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ లో వారి కుటుంబ సభ్యులకు గ్రామస్థుల సమక్షంలో అందజేశారు. మృతుడు శివకుమార్ కుటుంబానికి పరిహారం అందెందుకు ప్రత్యేక చర్యలు తీసుకుని కృషి చేసిన ఎమ్మెల్యే కు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు. నాగప్ప కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపి మీకు ఎల్లపుడూ రుణపడి ఉంటామని భావోద్వగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు మునిందర్ రెడ్డి, వీరా రెడ్డి, రాములు, దస్తయ్య గౌడ్ తదతరులు ఉన్నారు.
తాండూర్ బస్సు డిపోలో రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు
- పాల్కొన్న ఆర్టీసీ సిబ్బంది సభ్యులు, జిల్లా ప్రభుత్వ వైద్య సిబ్బంది
తాండూర్ : తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లో మంగళవారం రోజున రక్తదాన శిభిరని ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా డిపో మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ రక్తదానం చేస్తే ఎలాంటి అపాయం ఉండదు అని,మన ఆరోగ్యానికి మంచిది మరియు రక్తదానం చేయడం వలన ఇతరుల ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతామని రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తెలిపారు.ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు తాండూర్ బస్ స్టేషన్లో మంగళవారం రోజున రక్తదాన శిభిరని ఏర్పాటు చేశాము.ఈ శిబిరం లో 27 మంది రక్తదానం చేసారని సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ యొక్క కార్యమాలలో మెడికల్ ఆఫీసర్ వాణి,జిల్లా ఆసుపత్రి ఆర్.ఎం.ఓ.ఆనంద్ గోపాల్ రెడ్డి,నవీన్,రవి సింగ్,శంసుందర్ రెడ్డి,బాలప్ప,శేఖర్,శ్రీను ఆర్టీసీ సిబ్బంది మరియు జిల్లా ప్రభుత్వ వైద్య సిబ్బంది తదితరులు పాల్కొన్నారు.