కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
బషీరాబాద్ : కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బషీరాబాద్ మండలంలో గొట్టిగా ఖుర్దు గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం ఎస్ఐ. విద్యా చరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బషీరాబాద్ మండల పరిధిలోని గొట్టిగా ఖుర్దు గ్రామానికి చెందిన మొహమ్మద్ బిజాని (26)కి 8 సంవత్సరాల క్రితం పర్వత్ పల్లి గ్రామానికి చెందిన పాష తో వివాహం జరిగింది . వీరికి ఇద్దరు సంతానం ఒక కుమారుడు, ఒక కూతురు.తాండూరులో ఉంటూ వారి యొక్క జీవనం కొనసాగించేవారు. కొన్ని రోజుల క్రితం మొహమ్మద్ బిజాని వారి స్వగ్రామమైన గొట్టిగా ఖుర్దు గ్రామానికి తల్లి నివాసానికి వచ్చింది. అయితే శనివారం సాయంత్రం ఐదు గంటలకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు,స్థానికులు పోలీసులకు పిర్యాదు చేయక కుటుంబ సభ్యులు ,పోలీసులు మెరుగైన వైద్యం నిమిత్తం తాండూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స మధ్యలోనే మరణించారు.మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.అదేవిధంగా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది అని తెలిపారు. బాధితురాలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కుటుంబ కలహాలే కారణమని గుర్తించడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
స్వేరో అనుబంధ సంఘాల సమన్వయ సమావేశం
తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఆదివారం రోజున జరిగిన స్వేరో సర్కిల్ కమిటీ వికారాబాద్ జిల్లా ఆద్వర్యంలో "స్వేరో అనుబంధ సంఘాల సమన్వయ సమావేశం" తాండూరులో నేడు నిర్వహించడం జరిగింది . అ-ఆ ( అక్షరం-ఆరోగ్యం ) నినాదంతో జ్ఞాన సమాజ ఏర్పాటులో అందరు భాగస్వాములు అవ్వాలని స్వేరో సర్కిల్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ రాజ్ స్వేరో పేర్కొన్నారు అలాగే స్వేరోస్ రాష్ట్ర సలహాదారులు విష్ణువర్ధన్ మాట్లాడుతూ సర్కిల్ బలోపేతంమే మన ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు ఇందులో భాగంగా తాండూర్ నూతన డివిజన్ కమిటీని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో
స్వేరో సర్కిల్ డివిజన్ కమిటీ -తాండూర్
నూతనంగా ఎన్నికయిన సభ్యులు
1. అధ్యక్షులు: -రమేష్ స్వేరో
2. ప్రధాన కార్యదర్శి :-బాల్ రాజ్ స్వేరో
3.ఉపాధ్యక్షులు :-కె రమేష్ యాదవ్
4. జాయింట్ సెక్రటరీ :-యాదిరాజ్
5.ఆర్గనైజింగ్ సెక్రటరీ:- ప్రసాద్
6. అధికార ప్రతినిధి :-మహమ్మద్ హాజీ
సభ్యులు :-
1.జనార్దన్
2.ప్రసాద్
3.కె నరేష్ కుమార్
4.కిషోర్
సలహాదారులు :-
1. కె మల్కప్ప
2. జిలాని
3. హెచ్ యాదప్ప