Type Here to Get Search Results !

Sports Ad

ఉచిత జైపూర్ కాళ్ల మార్వాడి యువమంచ్ సేవలు

 


ఉచిత జైపూర్ కాళ్ల మార్వాడి యువమంచ్ సేవలు  

  •   మార్వాడి యువమంచ్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
  • 33 ఏళ్ళుగా వీళ్లు చేస్తున్న సేవలు 

తాండూరు : మార్వాడి యువమంచ్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు. మార్వాడి యువమంచ్ అధ్వర్యంలో తాండూరు పట్టణం బాలాజి మందిర్ లో ఏర్పాటు చేసిన ఉచిత జైపూర్ కాళ్ల మరియు అవయావాల అమరిక కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చిన వారిని ఎమ్మెల్యే పలకరింఛి కాసేపు వారితో కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మర్వాడి యువ మంచ్ వారు ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి స్థానికులే కాకుండా జిల్లా నలుమూలల మరియు కర్ణాటక రాష్ట్రం నుండి రావడం చాలా సంతోషకరం అని తెలిపారు.33 ఏళ్ళుగా వీళ్లు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. గత రెండు రోజుల నుండి సుమారు 250 మంది ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. వీరి సేవల విస్తరణకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారితో కలిసి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్, నర్సింలు, శ్రీనివాస్ చారి, రాజు గౌడ్, నర్సి రెడ్డి పట్టణ అధ్యక్షుడు నయీం ఆఫ్ఫు, పేద్దేముల్ అధ్యకుడు కొహిర్ శ్రీనివాస్, సంతోష్ గౌడ్, యోగానంద, రవి, టిప్పు, ఇంతియాజ్ బాబా, మార్వాడి యువమంచ్ సేవలు తదితులున్నారు.



గ్రామాలకు ఫాగింగ్ మిషన్లు అందజేత

  • గ్రామలా రూపురేఖలు మారాయి
  •  పల్లెలకు నిధులస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆరెఎస్
  • యాసంగిలో వారి సాగు చెయ్యొద్దు మంత్రి సబితా ఇంద్ర రెడ్డి

 తాండూర్ : తాండూరు పట్టణం తులసి గార్డెన్స్ లో నియోజకవర్గ పరిధిలోని 123 గ్రామ పంచాయతీలకు ఫాగ్గింగ్ మిషన్లను పంపిణీ చేశారు. దేశంలో గ్రామపంచాయతీలకు ప్రతి నెల నిధులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని విద్య శాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి అన్నారు.తాండూర్ పట్టణంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫాగింగ్ మిషన్ల పంపిణి చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు ప్రభుత్వం నర్సరీ, డంపింగ్ యార్డులు, వైకుంఠదమాలు, పల్లె ప్రకృతి వానలు నిర్మించి గ్రామాల రూపు రేఖలను మార్చుతుందన్నారు. గ్రామాల్లో పరిశుద్యం మెరుగుపడటంతో సీజనాల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయన్నారు. తాండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ప్రతి గ్రామానికి ఫాగింగ్  అందించడం అబినానదానియమన్నారు. వీటిని పూర్తి స్థాయిలో వినియోగించి దోమల నివారణకు కృషి చేయాలనీ తెలిపారు. యాసంగి లో కేంద్రం ధాన్యం కొనబొమని ప్రకటించిన నేపథ్యంలో రైతులు వరికి ప్రత్యన్మయ పంటలు చేసుకునేలా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అవగాహనా కల్పించాలన్నారు. అనంతరం కోట్ పల్లి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ లకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో విద్య శాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి,ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ వాణీ దేవి,సూరబివానీదేవి, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ ఛైర్పర్సన్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies