ఘనంగా చేరుపుకున్న మెథడిస్ట్ చర్చి 50 వ వార్షికోత్సవం
తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యం..
ప్రతి ఒక్కరి సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం..
కరోన మహమ్మారిలోను యధావిధిగా సంక్షేమ పథకాలు అమలు..
పెద్దేముల్ : తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభిస్తుందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు. ఈరోజు పెద్దేముల్ మండల ఇందూర్ గ్రామంలో ఉన్న మెథడిస్ట్ చర్చ్ యొక్క 50 వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్కొని ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభిస్తుందని, ప్రతి ఒక్కరి సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని అన్నారు. కరోన మహమ్మారిలోనూ సంక్షేమ పథకాలను యధావిధిగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘ కాపరి, సంఘ యువకులు ,ఎంపిటిసి ప్రవీణ్ పటేల్, ఎంపీపీ తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, ఎంపీపీ బాలేశ్వర గుప్తా, పట్టణ అధ్యక్షుడు నయీం అఫు, నాయకులు రమేష్, మోగ్లప్ప, నర్సింలు, శ్రీనివాస్ చారి, నార్సి రెడ్డి, అడ్వకేట్ గోపాల్, మార్కెట్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- రోడ్ల నిర్మాణం వేగవంతం చేయాలి..
- నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవు..
- పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి..
- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ : తాండూర్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ఆదేశించారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ఈరోజు తొర్మామిడి రోడ్డ పనులను పరిశీలించారు. ఆత్కూర్ సమీపంలో రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించి నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవని అక్కడ పనులు చేపట్టిన వారితో పేర్కొన్నారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. రానున్న కొద్ది కాలంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని రోడ్లు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.