మాజీ ప్రధాని
షింజో అబే దారుణ హత్య
అంతర్జాతీయ : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు . దక్షిణ జపాన్ లోని నారా నగరంలో రైల్వే స్టేషన్ వెలుపల ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఈ ఘోరం జరిగింది వెనుక నుంచి వచ్చిన మాజీ సైనికుడు నాటు తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ కు నమ్మకమైన మిత్రుడిగా వ్యవహరించిన షింజో ఓ మాజీ సైనికుడి తూటాలకు బలయ్యారు.
పిడికిలి పైకెత్తి మాట్లాడుతున్న షింజో అబే మేడలో ఒక తూటా గుండెలో మరో తూటా వెంట వెంటనే దూసుకుపోయాయి వెంటనే అయన ఛాతి పట్టుకొని కుప్పకూలిపోయారు తెల్లటి చొక్కా ఎర్రటి రక్తంతో తడిసిపోవడంతో ఆయనపై కాల్పులు జరిగిన విషయం చుట్టుపక్కల వారికీ అర్థమైంది. అప్పటికప్పుడు హెలికాఫ్టర్ పై ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స చేస్తుండగానే షింజో తుది శ్వాస విడిచారు.
షింజో మరణం ప్రపంచ దేశాలను దిగ్ర్బాంతికి గురిచేసింది. అయన రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో ప్రధాని పదవి నుంచి వైదొలగినప్పటికీ ఇప్పటికి జపాన్ రాజకీయాలను శాసించే అత్యున్నత నేరుగా వెలుగొందుతూన్నారు. జపాన్ చరిత్రలో అత్యధిక కాలం 9 ఏళ్ళు ప్రధానిగా కొనసాగిన ఘనత కూడా ఆయనదే సైనికుడి అసంతృప్తి కాల్పులు జరిపిన మాజీ సైనికుడి పేరు ఠేత్సుయయమగామి 41 నారా పట్టణానికి చెందిన వాడే జపాన్ నావికా దళంలో 2002 నుంచి 2005 వరకు ముమూడేళ్ల పటు పని చేశాడు.
అతడిని సంఘటన స్థలంలోనే
పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.అతని వద్ద డబుల్ బ్యాలెట్ షాట్ గనును స్వాధీనం
చేసుకున్నారు. త్రీడి ప్రింట్టింగ్ పద్దతిలో హంతకుడె స్వయంగా గాన్ను తయారు చేసుకొని
ఉంటాడని భావిస్తున్నారు. హంతకుడు షింజో వెనుక నిలబడి కేవలం పది అడుగుల దూరం నుంచి
కాల్పులు జరిపాడు.రెండో బుల్లెట్ గుండెకు గుండెకు తగలగానే షింజో పడిపోయారు.హంతకుడు
పారిపోయేందుకు ప్రయత్నం చేయలేదు చంపడానికే కాల్చానని చెప్పాడు. హంతకుడి
ఉద్దేశమేంటో ఎందుకు చంపాడో ఇంకా వివరాలు వెల్లడి కాలేదు.షింజో పట్ల అసంతృప్తి
ఉందని మాత్రమే చెప్పాడు అతని ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు పేలుడు పదార్దాలు
లభించాయి.






 
 
 
 
