జాగ్రత్త కరోనా కలం మళ్ళీ మొదలైయింది
వికారాబాద్ :
వికారాబాద్ జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. పరిగి కులకచర్ల
పెద్దేముల్ ప్రభుత్వాస్పత్రుల్లో కోవిడ్ పరీక్షలు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో 18 మందికి పరీక్షలు నిర్వహించగా పరిగి మండలం
హనుమంగండీ తండాకు చెందిన వ్యక్తికీ పాజిటివ్ వచ్చిందని వైద్యసిబ్బంది తెలిపారు.
కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 17 మందికి కరోనా
పరీక్షలు నిర్వహించారు కులకచర్ల గ్రామానికి చెందిన వ్యక్తికీ పాజిటివ్గా నిర్దారణ
అయింది జ్వరం ఇతర లక్షణాలతో అస్వస్థతకు గురైన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని
సీహెచ్ వో చంద్రప్రకాష్ తెలిపారు.పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో 10 మందికి పరీక్షలు
నిర్వహించగా ఇద్దరికి కరోనా పాజిటీవ్ తేలింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని
ఆరోగ్య కేంద్రం సిబ్బంది సూచించారు. మాస్కులు తప్పక ధరించాలని చేతులు శానిటైజర్ తో
శుభ్రం చేసుకోవాలని తెలిపారు.






 
 
 
 
