కానిస్టేబుల్ పై దాడి...చేసిన వ్యక్తి పై కేసు !!
బషీరాబాద్ : కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రోజు రాత్రి బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆదేశాల మేరకు పెట్రోలింగ్ వెళ్లిన కానిస్టేబుళ్లు శ్రీనివాసులు,తిరుపతి రాత్రి అంధజ 12:00 గంటల సమయంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ వద్దకు రాగా అక్కడ అదే గ్రామానికి చెందిన చెన్నయ్య గౌడ్.కానిస్టేబుల్ ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావ్ అని అడిగారు ?వారి వద్ద ఉన్నా ఫింగర్ ప్రింట్ స్కానింగ్ డివైస్ లో చెక్ చేయడనికి సహకరించమని కోరగా అతను తాగిన మైకంలో దుర్భాషలు ఆడుతూ కానిస్టేబుల్ శ్రీనివాస్ పైకి వెళ్లి కాలర్ పట్టుకుని లాగి చేతులతో కొట్టి గాయపర్చాడు. పక్కనే ఉన్న కానిస్టేబుల్ తిరుపతి ఆపడానికి ప్రయత్నించిన అతను వినకుండా బుతుమాటలు తిట్టాడు.ఆ తర్వాత కానిస్టేబుల్ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కి వచ్చి తను తిట్టి దాడి చేసిన వ్యక్తి పేరు చెన్నయ్య గౌడ్ అని అతని మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు ఇచ్చాడు.ఈ మేరకు బషీరాబాద్ ఎస్ఐ కేసు నమోదు చేసినాట్లు తెలిపారు.