"మీతో నేను" కార్యక్రమం పాల్కొన
- గ్రామంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
- ధారూర్ మండలం మరియు పలు గ్రామంలో
వికారాబాద్ : బుధవారం నాడు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ "మీతో నేను" కార్యక్రమంలో పలు గ్రామంలో పగటి పూట విద్యుత్ దీపాలు వెలుగుతుండడంతో,థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని మరియు పంటపొలాల్లో పలుచోట్ల వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని, అవసరమైన చోట నూతనంగా విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ శాఖ వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు.గ్రామంలో ప్రతి గురువారం ANM లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సేవలు ప్రజలకు అందించాలన్నారు.గ్రామంలో మురుగు కాలువలను శుభ్రం చేస్తూ, పిచ్చి మొక్కలు, తొలగిస్తూ శానిటేషన్ చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
గ్రామంలో 1 మరియు 8వ వార్డులలో నీటి కొరత ఎక్కువగా ఉందని ప్రజలు తెలుపగా,ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి,లీకేజీలను వెంటనే సరి చేసి,ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని పూర్తి స్థాయిలో అందించాలని,ప్రజలు మిషన్ భగీరథ నీటిని త్రాగేలా మిషన్ భగీరథ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.గ్రామంలో అవసరమైన చోట రోడ్లు మరియు మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు.గ్రామంలో పశువుల డాక్టర్ అందుబాటులో ఉంటూ పశువులకు వైద్య సేవలు అందించాలన్నారు.గ్రామ ప్రజలు ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని,వాటిని వాడుకలో ఉంచాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.