రైతులకు నష్టం తెస్తున్న...RBL ఫ్యాక్టరీ పై చర్యలు
- RBL ఫ్యాక్టరీలో అనుమతి లేకుండా అదనపు ప్లాంట్
- RBL యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి
- TSPCB తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ లో ఫిర్యాదు
యాలాల : కెవిపిఎస్ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో లో RBL అనుమతి లేకుండా అదనపు ప్లాంట్ నిర్మాణం నిలిపివేయాలని Environment Engg(EE) M. వెంకట నర్సు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని జక్కెపల్లి గ్రామ పరిధిలోని RBL ఫ్యాక్టరీ యొక్క స్థాయిని పెంచాలని,90 నుండీ 200 వరకు పెంచడానికి ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి, అనుమతులు ఇవ్వడం సరైంది కాదు.అని RBL ఫ్యాక్టరీ,(పరిశ్రమ)యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఫ్యాక్టరీ వల్ల వెదజల్లే మురికి నీటిని బయటి కాలువల ద్వారా వాదలడం వల్ల రైతులు వేసుకున్న పంట పూర్తిగా దిగుబడి రాకుండా నష్ట పోతున్నారు.మరియు ఫ్యాక్టరీ నడుస్తున్నప్పుడు బయటకు వెదజల్లే పొగ గాలిలో కలిసి గాలి కాలుష్యం ఏర్పడుతుంది.
అదేవిదంగా దురవాసన తోటి చుట్టపక్కల గ్రామాలు అయినా జక్కెపల్లి, బెన్నూర్ సంగేమ్ కురదు,యాలాల,హజిపూర్,గోరెపల్లి కిష్టపూర్ గ్రామ ప్రజలు తీవ్రంగా అనారోగ్యంతో బాధపుతున్నారు.అదేవిదంగా RBL ఫ్యాక్టరీలో స్థానిక యువకులకు,భూములు కోల్పోయిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా,పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు చెప్పితేనే,నాన్ లోకల్ వాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నారు.ఈ విదంగా ఈ సమస్యలపై మండల,జిల్లా స్థాయి,TSPCB,HRC లో అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యం వహిస్తున్నారు.RBL యాజమాన్యం పలుకు బడి ఉన్న రాజకీయ నాయకుల యొక్క అండదండలతో ఫ్యాక్టరీ నడుస్తున్నది.ఇప్పటికి అయినా జిల్లా కలెక్టర్,అధికారులు మరియు రాష్ట్ర స్థాయి పొల్యూషన్ అధికారులు,రైతుల యొక్క సమస్యలు పట్టించుకొని వారికీ న్యాయం చేయగలరు.లేనిచో RBL ఫ్యాక్టరీ చుట్టు పక్కల ఉన్న గ్రామాల రైతులను ఏకం చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో జక్కెపల్లి రైతులు పట్లోళ్ల యాదిరెడ్డి,P.సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.