జీవన్గి గ్రామంలో ఉరేసుకుని ఆత్మహత్య
బషీరాబాద్ Basheerabad : బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో దాసరి నరేష్ అనే వ్యక్తి ఇంట్లో ధూలానికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకి పాలపడ్డాడు. వివరాల్లోకి వెళితే నరేష్ ది పెద్దేముల్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన వారు.జీవన్గి గ్రామానికి చెందిన మౌనికతో 6 ఏళ్ల క్రితం వివాహమైంది. వాళ్లకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వల్లకి తారచు గొడవలు జరుగుతూండేవి పెద్దమనుషుల సమక్షంలో నచ్చజెప్పేవారు. నిన్న రాత్రి కూడా మల్లి భార్యభర్తలకి గొడవ జరిగింది.మౌనిక పిల్లలని తీస్కోని బైటకి వెళ్ళిపోయింది ఇంట్లో ఒంటరిగా ఉన్న నరేష్ ధూలానికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకి పాలుపడ్డాడు. నరేష్ తల్లి సావిత్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నామోదు చేస్కుని డెడ్‌బాడీ తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్ట్‌మార్టం చేసిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించరు అని ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపారు.