ఘనంగా లోక కల్యాణం సీతారాముల కల్యాణం
-ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు
తాండూర్ Tandur : తాండూర్ పట్టణంలోని పలు దేవాలయాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి పాల్కొన్నారు.గురువారం నాడు శ్రీరామ నవమి సందర్భంగా తాండూరు పట్టణంలోని సాయిపూర్ హనుమాన్ టెంపుల్,తులసి నగర్ వినాయక టెంపుల్,ఇంద్రనాగర్ రామ్ మందిర్,మాల్ రెడ్డి పల్లి,సిసిఐ కాలనీ,భద్రేశ్వర దేవాలయలలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి. పట్లోళ్ల దీప నర్సింలు పాల్కొన్నారు.అనంతరం సీతారాములను దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనదని రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని సీతారాముల ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీతారామచంద్రమూర్తులను వేడుకుంటూ ప్రజలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు.