ప్రజల సమస్యల కోసమే పోరాడుతున్న ఉద్యమ నాయకురాలు గీత
- రాష్ట్ర సహాయ కార్యదర్శిగా వై.గీత
వికారాబాద్ Vikarabad : వికారాబాద్ జిల్లా జిల్లాలో నాడు విద్యార్థి నాయకురాలిగా,ఉద్యమ నాయకురాలిగా విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పోరాడి సమస్యలు పరిష్కరించి,తనదైన ముద్ర వేస్తూ నేడు ప్రజల సమస్యల కోసమే పోరాడుతున్న ఉద్యమ నాయకురాలు గీత ఎక్కడ సమస్య ఉన్న నేనున్నాను అంటూ ముందుకు వచ్చి సమస్య తెలుసుకుని పరిష్కరించే గొప్ప నాయకురాలు.
భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర 9వ మహాసభలు మంచిర్యాల పట్టణంలో శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఉత్సాభరితంగా జరిగాయి మహాసభల్లో దేశంలో రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పైన చర్చించుకుని భవిష్యత్తు కార్మిక వర్గ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది దేశంలో ప్రధానంగా నిరుద్యోగ సమస్య కార్మిక హక్కుల కాలరాశి నాలుగు లేబర్ కోడ్ లు కనీస వేతనాలు ఉద్యోగ భద్రతకై పోరాడాలని తీర్మానించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా IFTU తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో వికారాబాద్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వై.గీతను Geetha రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది.
వికారాబాద్ జిల్లాలో నిరంతరం ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పోరాడే నాయకురాలికి అరుదైన గౌరవం దక్కింది.IFTU తెలంగాణ రాష్ట్ర సహాయకురాలిగా ఎన్నికైన గీత మునుముందు మరింత సేవా కార్యక్రమాలు చేస్తానని నన్ను గుర్తించి ఈ పదవి అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు.వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ మరింత సేవ చేసే అవకాశం దక్కిందని ఎలాంటి సమస్య ఉన్న, విద్యార్థులకు గాని కార్మికులకు గాని పేద ప్రజలకు గాని అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్న ముందుండి పోరాడుతానని ఆమె తెలిపారు.