పదవ తరగతి విద్యార్థులకు పాడ్స్ అందజేసిన అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు
బషీరాబాద్ Basheerabad : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వర్ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఫేర్వెల్ డే ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష పాడ్స్ మరియు పెన్ను,పెన్సిల్స్ పంపిణి చేశారు.అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు మాట్లాడుతూ పదవ తరగతి ఉతిర్ణతలో మైల్వర్ విద్యార్థులు మండల్ మొదటి స్థానం వస్తే వారికీ రూ.5000/- రుపాయిలు బహుమానం ఇవ్వడం జరుగుతుంది అని భీమ్ యువసభ్యలు హామీ ఇచ్చారు.విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని డా.బి.ఆర్.అంబేద్కర్ వాలే ఉన్నత శిఖరానికి చేరాలంటే చదువు ఒక్కటే మార్గం అని తెలిపి విద్యార్థులందరికీ అల్ ది బెస్ట్ అని తెలిపారు.