బషీరాబాద్ ఎఏంసీ చైర్మన్ పదవి కోసం
బషీరాబాద్ Basheerabad : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల ఎఏంసీ చైర్మన్ పదవి నిమిత్తము మంగళవారం రోజున ఎమ్మెల్యేను తాండూరు క్యాంపు కార్యాలయంలో కలిసి విన్నవించినట్లు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రామునాయక్ తెలిపారు.ఈ సారి బషీరాబాద్ ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వు అయినందున తన సతీమణి శాంతాబాయి రామునాయక్ పరిశీలించాలని ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా తెలిపారు.ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ సమావేశమై పేరును కోరినట్లు త్వరలో నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు ఆయన వివరించారు.మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు గారు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు.ఈ సమావేశంలో సర్పంచులు శివ్యానాయక్, దేవ్ సింగ్ , సూర్యనాయక్,సోమశేఖర్రెడ్డి,మాజీ ఎంపిటిసి నరేష్ చౌహన్ తదితరులు పాల్కొన్నారు.