రాహూల్ గాంధీ పై అప్రజాస్వామికంగా అనర్హత వేటు
పాల్వంచ Palvancha : పాల్వంచ పట్టణంలో రాహూల్ గాంధీ పై అప్రజాస్వామికంగా అనర్హత వేటు వేసి పార్లమెంటు సభ్యుత్వం రద్దు చేసినందుకు నిరసనగా పాల్వంచ పట్టణంలోని గాంధీ విగ్రహం ముందు నోటికి నల్లరంగు రిబ్బన్ ధరించి నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు మరియు కాంగ్రెస్ నాయకులు.ఈ సందర్భంగా నూకల రంగారావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మోడీ చర్యలు ఉన్నాయని,రాజకీయ వేదికలో మాట్లాడిన మాటలను వక్రీకరించి అనర్హత వేటు వేయడం సమంజసం కాదని,అల చేసుకుంటూ పోతే ఈ దేశంలో రాజకీయ నాయకుడు అనే వారే ఉండరని,అల అనర్హత వేటు వేయవలసి వేస్తే ముందుగా బీజేపీ నాయకుల పైన వేయాల్సి వస్తుందని,దేశాన్ని పాలించిన కుటుంబం మీద మరియు సోనియా గాంధీ మీద సమాజం తలదించుకునేల మాట్లాడినప్పుడు ఏమి చేశారని ప్రశ్నించారు.
మోడీ,బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా చట్టపరంగా కాంగ్రెస్ పార్టీ వాటిని ఎదుర్కుంటుంది అని,మీరు ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ పార్టీ మీద ,రాహూల్ గాంధీ మీద ప్రజలకు ప్రేమ ,నమ్మకం పోవన్నారు..ఈ కార్యక్రమంలో బద్ది కిషోర్, కొండం వెంకన్న గౌడ్, రాము నాయక్, వానపాకుల రాంబాబు, సోషల్ మీడియా కో- కో ఆర్డినేటర్ షఫీ, యూత్ కాంగ్రెస్ యమ్మన భాను తేజ, సూర్య కిరణ్ తదితరులు పాల్గోన్నారు.