MM కీరవాణికి కరోనా పాజిటివ్ ?
ఈ మధ్యనే తెలుగు రాష్ట్రం గర్వపడేలా తెలుగు ఇండస్ట్రీ గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకునేలా చేశారు.ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి అలాగే ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పాటకి ఆస్కార్ అవార్డు రావడం కోసం ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ కూడా నిర్వహించారు.ఇక చివరి వరకు ఆస్కార్ వస్తుంది అని నమ్మకం వారిలో లేదు కానీ ఎలాగైనా వస్తుంది అనే గట్టి నమ్మకం మాత్రం ఉంది.
ఇక వాళ్ళు అనుకున్నట్టే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వచ్చింది. ఇక ఆస్కార్ అవార్డు వేదికపై కీరవాణి అలాగే చంద్రబోస్ గారు ఇద్దరు ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. ఇక ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ ముగించుకొని ఈ మధ్యనే త్రిబుల్ ఆర్ మూవీ యూనిట్ మొత్తం ఇండియాకి చేరుకుంది.అయితే తాజాగా ఎం ఎం కీరవాణి హాస్పిటల్ బెడ్ పైపడుకున్న ఫొటో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
విషయంలోకి వెళ్తే ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఇప్పటికే చాలా చోట్ల ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ప్రమోషన్స్ నిర్వహించింది.ఇక దీనికోసం కీరవాణి చాలా చోట్ల తిరిగారు.దాంతో ఆయనకు ఇండియా వచ్చాక అస్వస్థతగా అనిపించడంతో స్వయంగా వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకున్నారట. ఇక కరోనా పాజిటివ్ అని రావడంతో ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు.అయితే ఈ విషయం ఇప్పటివరకు తెలుగు మీడియా ఛానల్లో ఇంకా బయటపడలేదు.
కానీ కీరవాణి ఆయన ఈ విషయాన్ని ఒక హిందీ మీడియా సంస్థతో చెప్పుకుంటూ నేను రేపు హాస్పిటల్ బెడ్ పైన ఉంటా నాకు కరోనా పాజిటివ్ అని చెప్పారు.ఇక హిందీ మీడియా కథనాల ప్రకారం కీరవానికి కరోనా వచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి చాలామంది నెటిజన్స్ కీరవాణి కరోనా నుండి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతంగా బయటపడాలని కోరుకుందాం.
మరిన్ని వార్తల కోసం....
- MM కీరవాణికి కరోనా పాజిటివ్ ? ఇక్కడ క్లిక్ చేయండి
- ఏప్రిల్ 1 నుండి ధరలు పెరుగుతాయి ఇక్కడ క్లిక్ చేయండి
- పాన్ కార్డు - ఆధార్ లింక్ గడువు పొడిగింపు ఇక్కడ క్లిక్ చేయండి