రాజశేఖర్ అయ్యగారికి ఘనంగా సన్మానం
కోటపల్లి Kotpally : వికారాబాద్ జిల్లా కోటపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ అయ్యగారికి తెలంగాణ కళానిలయం సాంస్కృతిక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నంది పురస్కారం అందించడం జరిగింది. కోటపల్లికి చెందిన రాజశేఖర్ అయ్యగారికి ఈ పురస్కారం రావడం కోటపల్లికి గర్వకారణంగా భావిస్తూ స్వామి గారికి కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్,తమ్మలి శ్రీనివాస్, శ్రీనివాస్ గుప్తా, భీమయ్య, బ్రహ్మం తదితరులు కలిసి శాలువాతో సన్మానించారు.
డిజిటల్ లావాదేవీల పై అవగాహన
ఆజాధిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కోటపల్లి మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో డిజిటల్ లావాదేవీలు నిర్వహించే అవగాహన సదస్సును మహిళా సమైక్య కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలోని మొట్టమొదటిగా కోటపల్లి మండల సమైక్య ఆధ్వర్యంలో మహిళా సంఘాలు డిజిటల్ లావాదేవీలు ఎలా నిర్వహించుకోవాలి అని మహిళా సంఘాల అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, ఏపిఎం శివయ్య, మహిళా సమాఖ్య ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.