ప్రజల కోసం "పల్లె పల్లెకు పైలెట్" కార్యక్రమం
* గ్రామ గ్రామాని పర్యటించారు
* ప్రజా సమస్యలకు చెక్
* ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ Tandur : వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో పల్లెపల్లెకి పైలెట్ కార్యాక్రమంలో భాగంగా యాలల మండలం రాస్నం గ్రామంలో ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పర్యటించారు.పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.రాస్నం మరియు గంగసాగర్ గ్రామానికి సీఎం కేసీఆర్ కృషితో గ్రామన్ని అభివృద్ధి కొరకు రూ.50 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో భాగంగా సంగాయిపల్లితాండాలో డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సంగాయిపల్లి తాండా, సంగాయిపల్లి మీది తాండా,పగిడియాల,సంగాయిపల్లి కింది తాండాల్లో పర్యటించి, ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఒక్క బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు.బంగారు తెలంగాణ కావాలంటే మళ్ళి బిఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు.బాగాయిపల్లి గ్రామంలో ఎమ్మెల్యై పైలెట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ లోకి చేరిన యువత, మహిళలు. సీఎం కేసీఆర్ కృషితో ఎమ్మెల్యై రోహిత్ రెడ్డి గారు చేపడుతున్న అభివృద్ధితోనే భారీ సంఖ్యలో పార్టీలో చేరామని సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు.అనంతరం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు.శ్రీ సద్గురు పొట్టి మహరాజ్ దేవస్థానం నూతన పాలక మండలి ప్రమానస్వీకారోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరై కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రత్యేక పూజలో పాల్కొన్నారు. ముద్దాయిపేట గ్రామంలో డా.బీఆర్.అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహానీయుల విగ్రహాలను ఆవిష్కరించారు.సంగాయిగుట్టకు చెందిన రూప్ సింగ్ భార్య సోనూభాయి ఇటీవల ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడి మరణించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రూప్ సింగ్ ను పరామర్శించి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు.