పండుగలను కుల,మతాలకు అతీతంగా శాంతియుతంగా జరుపుకోవాలి
బషీరాబాద్ Basheerabad News : ప్రజలు పండుగలను కుల,మతాలకు అతీతంగా శాంతియుతంగా జరుపు కోవాలని తాండూరు రూరల్ సీఐ రాంబాబు తెలిపారు. బుధవారం ఆయన బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్సై విద్యా చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో రాబోయే పండుగల దృష్ట్యా అన్ని మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి, శుభ శుక్రవారం,రంజాన్ పండుగలను శాంతియుతంగా పూర్తి చేసేందుకు పోలీసులకు సహకరించాలని అన్నారు. అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుట నేరం అవుతుందని అన్నారు.సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత పట్టణ ప్రజలదని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ కులా సంఘాలు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.