దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ
* మోదీ నీవు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా
* రాహుల్ గాంధీ నీ ఏమి చేయలేవు
* హత్ సే హత్ అభియాన్ జోడో యాత్ర
* టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ
కొత్తగూడెం kothagudem : కొత్తగూడెం నియోజకవర్గం పట్టణ పరిధి రైల్వే స్టేషన్ నుండి హత్ సే హత్ అభియాన్ జోడో యాత్ర మొదలులై యం.జి రోడ్డు,పెద్దబజార్, చిన్నబజార్ ల యందు టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ అద్వర్యంలో భారీ జన సందోహంతో యాత్ర నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమములో ఏడవల్లి ప్రతి ఒక్కరినీ కలిసి కరపత్రాలు పంపిణీ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏమి చేస్తుంది అని చెప్పుకుంటూ కదిలారు బి.అర్.యస్,బీజేపీ పార్టీలు అవలంబిస్తున్న నిరంకుశ పాలనను ప్రజల కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ ముందుకు సాగారు మోదీ మా నాయకుడు రాహుల్ గాంధీ పై కక్ష పూరితంగా కక్ష కి పాల్పడుతున్న ,ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు,ప్రజలందరూ గమనిస్తూన్నారు మోదీ నీ యొక్క సంపాదన,నీయొక్క దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటున్న విధానాన్ని ఎండ గడుతున్నందుకు దేశాన్ని అప్పుల పాలు చేస్తున్న విధానాన్ని బయట పెడుతున్నాడు అందుకు గానూ నీవు రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేసవా మోడీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో నీవు ఏ మోదీ తో కేసులు పెట్టించిన మా నాయకుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు రాబోవు ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది
రాహుల్ గాంధీ చెప్పిన ప్రతి ఒక్క హామీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ కంచు కోట కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాయి పేద ప్రజల గుండె చప్పుడు కాంగ్రెస్ పార్టీ అని కే.సి.అర్ రాష్ర్టంలో చేస్తున్న నీచపు పాలనకు ప్రజలు చరమ గీతం పాడక తప్పదు,బంగారు తెలంగాణ అని బ్రష్టు పడ్డ తెలంగాణ చేసి రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు రాష్ర్టంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చక పొగ విద్యార్థుల,నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు ఇక నీ మాటలు ప్రజలు నమ్మరు.
కే.సి.అర్ నీ మాటలు కేవలం త్రాగిన వాడి మాటలు నీటి మీద రాతల మాదిరి తప్ప ఉపయోగం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరునీ ఏడవల్లి కృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమములో:సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య,కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్,పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు,చుంచుపల్లి మండల అద్యక్షులు అంతోటి పాల్,బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,INTUC నాయకులు జెలిల్,మైనార్టీ నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ గులాం మతీన్,లక్ష్మిదేవిపల్లి మండల యస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుబ్బా రెడ్డి,లీగల్ సెల్ నియోజకవర్గ ఇంచార్జీ అరకల కర్ణకర్,INTUC నాయకులు కాలం నాగభూషణం, పైడిపల్లి మనోహర్,కాంగ్రెస్ నాయకులు కొండం వెంకన్న గౌడ్, రామనాయక్,టౌన్ మహిళ అధ్యక్షురాలు వాలి,టౌన్ నాయకురాలు చంద్రకళ,కలిపాక సత్యనారాయణ,సారంగా ఫని,నాగేశ్వరావు,జక్కుల శ్రీనివాస్,గడ్డిగుట్ట నరేష్,శనగ లక్ష్మణ్,మహ్మద్ పక్రొద్దిన్,భూక్యా శ్రీనివాస్,బట్టు గణేష్,కృష్ణ మూర్తి,స్టీఫెన్ లాజరస్,మొద్దు శ్రీనివాస్,పవన్, తదితరులు పాల్గొన్నారు.