అంటరాని వారిని సమానత్వం కోసం ఎంతో కృషి
* ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కొత్తగూడెం Kothagudem : కొత్తగూడెం పట్టణంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్భంగా TPCC జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ కొత్తగూడెం TPCC General Secretary Edavalli Krishna కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ అంటరాని వారి సమానత్వం కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు అని,భారతదేశంలో హరితవిప్లవం,వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడంలో ఆయన ఎంతో సహకారం అంధిచాడని,కరువు సమయంలో, ఆహార సంక్షోభాన్ని నివారించటానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించమని కోరినప్పుడు అంగీకారం తెలుపటం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం అని,కార్మిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారు.
జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రక్షణ,వ్యవసాయ,కార్మిక,రవాణా మంత్రిగా అనేక పదవులు ఆయన కృషికి ఆయనను వరించాయి.ఇలాంటి మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయల శాంతయ్యా,కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్,పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు, చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పౌల్,బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,INTUC జలీల్,మైనార్టీ జనరల్ సెక్రటరీ నియోజకవర్గం గులాం మతీన్,లక్ష్మీదేవిపల్లి మండల యస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుబ్బా రెడ్డి,లీగల్ సెల్ నాయకులు అరకల కరుణాకర్ ,INTUC నాయకులు కాలం నాగభూషణం, కొండం వెంకన్న గౌడ్, వాలి,జక్కుల శ్రీను,కలిపాక సత్యనారాయణ, రామ్ నాయక్,సారంగా పాని,గడ్డిగుట్ట నరేష్,శనగ లక్ష్మణ్,పక్రొద్దిన్,బుఖ్య శ్రీనివాస్,రమేష్,బట్టు గణేష్,కృష్ణ మూర్తి,మొద్దు శీను స్టీవెన్ లాజరస్ తదితరులు పాల్గొన్నారు.