ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కోటపల్లి Kotpally : బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను కోటపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.కోటపల్లి అంబేద్కర్ చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ గారు గొప్ప సంఘసంస్కర్త మరియు స్వతంత్ర యోధుడు తాను తొలి ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశానికి ఎంతో సేవ చేయడం జరిగింది అని అన్నారు.వారు కుల రహిత సమాజం ఏర్పడాలని ఎంతో కృషి చేశారు, మనుషులంతా సమానం అని అన్నారు స్వతంత్ర పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించి స్వతంత్రం అందించడంలో చాలా కృషి చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా,ఉపాధ్యక్షులు మోసిన్, సీనియర్ నాయకులు రత్నయ్య, సమ్మయ్య, అన్నా సాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు కృష్ణ, బుగ్గాపురం ఇన్చార్జ్ నర్సింలు గౌడ్, శ్రీశైలం, ఏ ఎస్సై వెంకటయ్య,కృష్ణ, నర్సింలు, సాంబయ్య, ఇబ్బు, అనంతయ్య, తదితరులు పాల్గొన్నారు.