తెలంగాణ విద్యుత్‌శాఖలో 100 ఉద్యోగాలు
జాబ్స్ Jobs : TSNPDCL వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TSNPDCL) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.
* జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్
పోస్టులు : 100
విద్యుత్ సర్కిళ్లు : వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్.
అర్హత : ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
వయసు : అభ్యర్థుల వయసు 2023 జనవరి 1వ తేదీ నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్‌లో పలు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : రూ.200 (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
ముఖ్యమైన తేదీలు...
దరఖాస్తు ఫీజు ప్రారంభతేదీ : ఏప్రిల్ 10, 2023
దరఖాస్తులు ప్రారంభతేదీ : ఏప్రిల్ 10, 2023
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది : ఏప్రిల్ 29, 2023 (సాయంత్ం 5 గంటల వరకు)
దరఖాస్తులకు చివరితేది : ఏప్రిల్ 29, 2023 (రాత్రి 11.59 వరకు)
దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ : 2023 మే 2 నుంచి 5వ తేదీ వరకు ఉంటుంది.
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ తేదీ : మే 22, 2023
పరీక్ష తేది: మే 28, 2023
వెబ్‌సైట్ : https://tsnpdcl.in