హిందూ ధర్మాన్ని గౌరవించే వారికే ఆధార్ కార్డులు ఇవ్వాలి
జగిత్యాల Jagithyala : దేశంలో హిందువులకు, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికే ఆధార్ కార్డులు ఇవ్వాలని పరిపూర్ణానంద స్వామి డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణంలో సోమవారం నిర్వహించిన వీరహనుమాన్ విజయయాత్రలో ఆయన మాట్లాడుతూ ‘హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరముంది. ముఖ్యంగా మన దేశంలో హిందువులుగా జీవించే వారికి, హిందువులు కాకున్నా హిందువులను గౌరవించే వారికి మాత్రమే ఆధార్‌కార్డులు ఇవ్వాలి. ఇందుకోసం పార్లమెంటు, ఇతర అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. జగిత్యాలకు చెబితే జగమంతా చెప్పినట్లే ఇక్కడి నుంచే ఈ అంశం దేశవ్యాప్తం కావాలి’ అని పిలుపునిచ్చారు.