పేపర్ లీకేజ్ పై...ఉపాధ్యాయుల నిర్లక్ష్యం
తాండూర్ Tandur News : తాండూర్ పట్టణంలో ఏదైతే పదోతరగతి పేపర్ లీకేజ్ జరిగిందో దాన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ పేపర్ లీకేజీ విషయంలో ఎవరున్నారు అనేది స్పష్టమైన దర్యాప్తు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి స్పష్టమైన నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని, బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ పేపర్ లీకేజీలో ఇన్విజిలేటర్ బందెప్పతో పాటు MEO గారి ప్రమేయం కూడా ఉన్నట్లు మేము అనుమానిస్తా ఉన్నాం. కాబట్టి MEO గారిని కూడా విధులనుంచి పక్కనపెట్టి, ఈ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ఎందుకంటే గతంలో అనేకసార్లు విద్యార్థి సంఘాలు, విద్యార్థులు తల్లిదండ్రులు, అనేకసార్లు ఈ ప్రైవేట్ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలని MEO గారికి ఎన్నోసార్లు చెప్పినా కూడా ఆయన పేడచెవిన పెట్టి ఈ ప్రవేట్ విద్యాసంస్థలకు ఏదైతే తొత్తుగా వివరించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పేపర్ లీకేజీ విషయంలో కూడా ఆయన హస్తం ఉన్నట్టు మేము అనుమానిస్తున్నాం. కాబట్టి స్పష్టమైన ఏదైతే విచారణ ఉందో ఒక ఉన్నత స్థాయి కమిటీలో విచారణ చేపట్టాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.