నిరంతరం నిఘా ఉంచడం మంచిది
తాండూర్ Tandur News : తాండూరు పట్టణంలో గల సాయిపూర్ లోని ప్రభుత్వ నెంబర్ వన్ స్కూల్లో జరిగిన పదో తరగతి పరీక్ష పేపర్ లీకుకు బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని బిఆర్ఎస్ విద్యార్థి విభాగం తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు జోగులా ఎబినేజర్ తాండూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జిల్లాని నాయకులు దీపక్ రెడ్డి విద్యాధికారులను మరియు పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశార.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీ పై స్పందించి తీవ్రంగా ఖండించారు ఇలాంటి వాళ్లను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలని ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా విద్యా అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని ఎగ్జామ్లు జరిగే సెంటర్లలో ఇన్విజిలేటర్ లకు ఫోన్ లను ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించకుండా చూడాలని ఈ విషయంలో ఎంఈఓ జిల్లా విద్యాధికారి నిరంతరం పర్యవేక్షించాలని వారు కోరారు.ఇప్పుడిప్పుడే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనను మరుస్తున్న విద్యార్థులను ఇప్పుడు పదో తరగతి పేపర్ లీక్ కావడంపై విద్యార్థులు గందరగోళం అయోమయంలో పడ్డారని విద్యార్థుల్లో పరీక్షలు అంటే లీకేజీ భయం వెంటాడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి ఘటనల వల్ల ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు చెడ్డపేరు వస్తుంది అని తెలిపారు.