Type Here to Get Search Results !

Sports Ad

సూపర్ ఉంది...వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ New feature in watsapp app

 

సూపర్ ఉంది...వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ 

- పాస్‌వర్డ్‌తోనే ఆ చాట్‌ ఓపెన్‌ 
- లాక్‌ చాట్‌ అదనపు ప్రొటెక్షన్‌

టెక్నాలజీ Technology : ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తన యూజర్లకు అనునిత్యం కొత్త ఫీచర్లు తీసుకొస్తూనే ఉన్నది.యూజర్ల ప్రైవసీ మరింత పెంచడానికి సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా ఆండ్రాయిడ్‌ బేటా వర్షన్‌ పరీక్షిస్తున్నట్లు వినికిడి. తాజాగా లాక్‌ చాట్‌ (Lock Chat) అనే కొత్త ఫీచర్‌ వాట్సాప్‌ డెవలప్‌ చేస్తున్నది. ఈ లాక్‌ చాట్‌తో యూజర్లు తమ ప్రైవేట్‌ చాట్లకు లాక్‌ విధించుకునే అవకాశం ఉంటది. అంటే ప్రతి ఒక్క వాట్సాప్‌ యూజర్‌కు తన పర్సనల్‌ చాట్‌లపై పూర్తిగా నియంత్రణ తెచ్చుకోవచ్చు.

ఈ లాక్‌ చాట్‌ ఫీచర్‌ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తే యూజర్ల ప్రైవసీతోపాటు సెక్యూరిటీ కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వాబ్‌టా ఇన్‌ఫో నివేదిక ప్రకారం ఒకసారి లాక్‌ చాట్‌ ఆప్షన్‌ వినియోగిస్తే యూజర తన ఫింగర్‌ ప్రింట్‌ లేదా పాస్‌వర్డ్‌తో మాత్రమే తిరిగి చాట్‌ వివరాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇతరులు ఎవ్వరూ మీ ఫోన్‌ చాట్‌ చూసే అవకాశం ఉండదు. లాక్‌డ్‌ చాట్‌లో పంపే వీడియోలు, ఫొటోలు ఆటోమేటిక్‌గా ఫోన్‌ గ్యాలరీలో సేవ్‌ కావు. ఇతరులు సున్నితమైన సమాచారం చూడకుండా లాక్‌ చాట్‌ అదనపు ప్రొటెక్షన్‌ లేయర్‌గా ఉంటుంది.

ఎవరైనా మీ ఫోన్‌ తీసుకుని పాస్‌వర్డ్‌ / ఫింగర్‌ ప్రింట్‌ లేకుండా లాక్‌ చాట్‌ తెరవడానికి ప్రయత్నిస్తే ఆ చాట్‌ మొత్తం డిలిట్‌ చేయాలని కోరుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ డెవలప్‌మెంట్‌ దశలోనే ఉంది. దీన్ని అధికారికంగా ఎప్పుడు బయట పెడతారన్న సంగతి తెలియాల్సి ఉంది. ఇంకా యూజర్ల టైపింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ పెంచడానికి అదనపు ఫార్మాటింగ్‌ ఆప్షన్లతో ‘టెక్ట్స్‌ ఎడిటర్‌’ అనే ఫీచర్‌ అందుబాటులోకి తేవడానికి వాట్సాప్‌ కృషిచేస్తున్నట్లు తెలుస్తున్నది.

మరిన్ని వార్తల కోసం...
సూపర్ ఉంది...వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి

- అన్నదమ్ములను ఒకటి చేసిన "బలగం సినిమా " ఇక్కడ క్లిక్ చేయండి 

- ఉపాధి హామీలో ఫేక్‌ హాజరుకు చెక్‌ ఇక్కడ క్లిక్ చేయండి


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies