ఎస్సీ బాలుర వసతి గృహం సమస్యలు పరిష్కరించాలి
- లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ LSO జిల్లా అధ్యక్షులు గుగులోతు శివవర్మ నాయక్
చిన్నగుడురు Chinna Guduru : నేడు చిన్నగుడురు మండల కేంద్రములో ఎస్సి బాలుర వసతి గృహం సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా LSO జిల్లా అధ్యక్షుడు శివ వర్మ నాయక్ మాట్లాడుతూ వర్షం వస్తే బిల్డింగ్ కురవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.పెంకటిల్లు వుండటంతో మొత్తం కవర్తో అడ్జెస్ట్ చేశారు.అయినా వర్షపు నీళ్ళు లోపలికి వస్తున్నాయి.పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది చాలాసార్లు పాములు తేళ్లు వచ్చాయి బయట వారు వచ్చి చంపారు.చాలామంది పిల్లలు హాస్టల్ ని చూసి వెళ్లిపోవడం జరిగింది. తక్షణమే నూతన భవనం ఏర్పాటు చేయాలి.అదేవిధంగా మరుగుదొడ్లు కూడా శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది.అదే విధంగా మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టని వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు.లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ LSO జిల్లా అధ్యక్షులు గుగులోతు శివవర్మ నాయక్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో LSO జిల్లా ఉపాధ్యక్షులు సేవాలాల్ మరియు హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.