కుల వివక్షత చూపుతున్న పొడేం వీరయ్య
* పోతురెడ్డి శ్రీనివాస్ రెడ్డి పై డిసీసి అద్యక్షులు పోడెం వీరయ్య చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
* సేవ్ కాంగ్రెస్ నీ సెల్ కాంగ్రెస్ చేస్తున్న భద్రాచలం ఏంఎల్ఏ
* ఈ నెల 9 న గాంధీ భవన్ లో నిరసన దీక్ష
* జిల్లా కాంగ్రెస్ నాయకులు,జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్కినేని సురేందర్,డాక్టర్ శంకర్ నాయక్
* మణుగూరు మండల అధ్యక్షులు గురజాల గోపి
* ములకలపల్లి మండల అధ్యక్షులు పేటేటి నర్సింహరావు
భద్రాద్రి కొత్తగూడెం Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొత్తగూడెం నియోజకవర్గంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు,మండల అధ్యక్షులు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు,లక్కినెని సురేందర్,డాక్టర్ శంకర్ నాయక్,మణుగూరు మండల అధ్యక్షులు గురజాల గోపి తదితరులు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య చేస్తున్న నిరంకుశ పాలన,ఒంటెద్దుల పోకడ,ఏఐసిసి,పిసిసి అదేశలను తుంగలో త్రొక్కుతూ చేస్తున్న దౌర్జన్యాలకు నిదర్శనం మొన్న పోయిన నెల 31నాడు పోతురేడ్డి శ్రీనివాస్ రెడ్డి నీ పినపకలో జరుగుతున్న రాజకీయాల కోసం మాట్లాడాలినీ వీరయ్య భద్రాచలం క్యాంపు కార్యాలయం పిలిపించి నీవు నాతో,నా వర్గంతో మాత్రమే ఉండాలి.
వేరే వర్గం వారితో తీరుగొద్దు అని హెచ్చరించారు దానికి శ్రీనివాస్ రెడ్డి నాది ఏ వర్గం కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ నా వర్గం అని వీరయ్యకి సమాధానం చెప్పాడు.దానికి కోపంతో శ్రీనివాస్ రెడ్డి పై దౌర్జన్యంగా కొట్టారు తన అనుచరులను పక్కన పెట్టుకొని నా పై దౌర్జన్యానికి పాల్పడ్డాడు.నాన్ ట్రైబల్ అనే నెపంతో అమ్మ,అక్క,చెల్లి అనే బేదం లేకుండా ఇష్టానుసారంగా బూతు పద జాలంతో తిట్టడం ఎంతవరకు సబబు,దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం.కాంగ్రెస్ పార్టీ కోసం శ్రీనివాస్ రెడ్డి అను నిత్యం కష్టపడి పని చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడు.
పార్టీ ఆదేశానుసారం ప్రతి కార్యక్రమములో పాల్గొంటూ ముందుకు సాగుతున్నాడు ఇల పార్టీ కోసం కష్టపడి పని చేసే వారిపై దౌర్జన్యాలు,బూతు పురాణం కానుకగా ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ వీరయ్య అని ఏద్దేవ చేశారు.ఇట్టి విషయంలో జిల్లా లో పలు కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్టున్నారు గతంలో ఇల్లందు మండల పార్టీ అధ్యక్షులు పోచం వెంకటేశ్వర్లు,ములకలపల్లి మండల అధ్యక్షులు పెటేటి నర్సింహరావు,మణుగూరు గురజాల గోపిల,కరకగూడెం మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్,అశ్వరావుపేట యంపిటిసి వేముల భారతి ల పై వీరయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలు అందరికీ చెలిసిందే మారుతాడు అని వేచి చూసిన ఫలితం లేకపోయింది.
ఇల పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ నెల 9దవ తేదీ నాడు హైదరాబాద్ గాంధీభవన్ వద్ద 500 మంది తో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది. విటి అన్నిటికీ ముఖ్య కారణం వీరయ్య నీ తక్షణం డిసిసి అధ్యక్షుడు నుండి తీసివేసి సమర్డుడికి ఇస్తే 5 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుందినీ ఆవేదన వ్యక్తంచేశారు.భద్రాద్రి జిల్లా లో ఇప్పటి వరకు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఏఐసిసి, పిసిసి డిసిసి వేసిన కమిటీలు రద్దు అయినవి కొత్తవి వేయండి అని చెప్పిన తన వర్గానికి కొమ్ముకాయడం తప్ప పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి గుర్తింపు లేదు.
మీము పార్టీ కోసం కష్టపడి పని చేసి సేవ్ కాంగ్రెస్ చేస్తుంటే వీరయ్య అధికార పార్టీ వారితో చేతులు కలుపుకుని సెల్ కాంగ్రెస్ గా మార్చుతూన్నారు.జిల్లా లో ఏఐసిసి,పిసిసి పిలుపు మేరకు ఒక్క కార్యక్రమము కూడా నిర్వహించకుండా,నియోజకవర్గంలో పర్యటించకుండ కాలయాపన చేస్తున్న వీరయ్య పై అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్కీనేని సురేందర్,డాక్టర్ శంకర్ నాయక్,గురజాల గోపి,పెటేటీ నరసింహరావు ఆరోపించారు.
ఈ కార్యక్రమములో కరకగూడెం జెడ్పీటీసీ కొమరం కాంతారావు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొలమురు రాజు,మండల కిసాన్ సెల్ అద్యక్షులు రవీందర్ రెడ్డి,పినపాక యూత్ అద్యక్షులు చంద వర ప్రసాద్,జిల్లా కార్మిక శాఖ మహిళ అధ్యక్షురాలు బోగినేని వరలక్ష్మి,యూత్ నాయకులు రహిం ఖాన్,కోటం రెడ్డి రాజశేఖర్ రెడ్డి,నాగరాజు,సంపత్,సురేష్,కట్టం సాయి, గాదే విజయ్ తదితరులు పాల్గొన్నారు.