పదవ తరగతి తెలుగు హిందీ పేపర్ల లీకేజీకి కారకుడు బండి సంజయ్
తాండూర్ Tandur News : తాండూర్ పట్టణంలో పదవ తరగతి తెలుగు హిందీ పేపర్ల లీకేజీకి కారకుడైన తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ గారి దిష్టిబొమ్మ హైదరాబాద్ రోడ్డు మార్గంలో బి ఆర్ఎస్ విద్యార్థి విభాగం తాండూర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బి ఆర్ఎస్ విద్యార్థి విభాగం తాండూర్ ఇంచార్జ్ జిలాని పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి మరియు జిల్లా నాయకుడు దీపక్ రెడ్డి టౌన్ వైస్ ప్రెసిడెంట్ షేక్ ఆకిబ్ మాట్లాడుతూ బండి సంజయ్ గారు తెలంగాణ పదో తరగతి విద్యార్థులను సక్రమంగా ఎగ్జామ్స్ రాయకుండా గందరగోళం పరిస్థితి ఏర్పడేటట్లు చేసి ప్రతిరోజు తమ బిజెపి అనుబంధ సంఘాల వాళ్లతో బిజెపి నాయకులతో టచ్ లో ఉండి పేపర్ లీకేజీలు చేయించి తెలంగాణ ప్రభుత్వాన్ని కెసిఆర్ గారిని విద్యాశాఖ మంత్రి గారిని కేటీఆర్ గారిని బద్లాం చేయాలనే ఉద్దేశంతో లీకేజీలు చేస్తున్నారు.ఖబర్దార్ బండి సంజయ్ ఇలాంటి నీచమైన పనులు చేస్తే నిన్ను తెలంగాణ నుంచి తరిమేసే పరిస్థితులు వస్తాయని మేము మా ప్రభుత్వం ఎల్లప్పుడూ తెలంగాణ విద్యార్థులకు రక్షణగా ఉంటామని అన్నారు.పేపర్ లీకేజీకి కారకుడైన బండి సంజయ్ గాని ఇంకా ఎవరైనా సరే చట్టం ఎవరికి చుట్టం కాదని కచ్చితంగా బండి సంజయ్ కి ఎవరైతే పేపర్ లీకేజ్ చేశారు.వాళ్లందరికీ తప్పకుండా శిక్ష పడుతుందని ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా విద్యాశాఖ అధికారులు నిగా ఉంచాలని అన్నారు.ఈ కార్యక్రమంలో టౌన్ సెక్రటరీ నాసిర్ జాయింట్ సెక్రెటరీ షోయబ్ నాయకులు నిరంజన్ గౌడ్ మహేశ్వర్ రెడ్డి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.