బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం భారీ సక్సెస్
* భారీ జన సందోహంతో కిటకిటలాడిన కొత్తగూడెం క్లబ్
* అభివృద్ధి అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే అభివృద్ధి
* తెలంగాణ రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావటం ఖాయం
* తెలంగాణ రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు
* కొత్తగూడెం నియోజకవర్గ అన్ని విధాలుగా నా హయాంలో అభివృద్ధి చెందిందని గర్వంగా చెబుతున్నా
భద్రాద్రి కొత్తగూడెం Kothagudem : భద్రాద్రి కొత్తగూడెంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు రాష్ట్ర మున్సిపల్ మంత్రి వర్యులు కేటీఆర్ సూచన మేరకు భద్రాద్రి కొత్తగూడెం శాసనసభ్యులు గౌరవ శ్రీ వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రోజు కొత్తగూడెం క్లబ్ నందు ఆత్మీయ సమ్మేళనంలో BRS కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగంలో భద్రాద్రి కొత్తగూడెం పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ నామా నాగేశ్వరరావు గారు మరియు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు రాబోయే రోజులలో మళ్లీ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి గౌరవ శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని ప్రసంగంలో ప్రకటించడం జరిగినది. తెలంగాణ విశిష్టత గురించి మరియు ఉద్యమం విషయాలు తెలిపారు.
ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో ఉమ్మడి జిల్లా ఎంపీ శ్రీ నామా నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు,శ్రీ వనమా రాఘవేందర్ గారు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, జెడ్పీటీసీ బరపాటి వాసుదేవరావు, ఎంపిపి లు బాదావత్ శాంతి, మడివి సరస్వతి, బుక్య సోనా, మార్కెట్ కమిటీ చైర్మన్ భుఖ్య రాంబాబు, నాయకులు MA రజాక్, కాసుల వెంకట్, JVS చౌదరి, భీమా శ్రీధర్, రావి రాంబాబు, యూసుఫ్,మసూద్, సుందర్ రాజ్, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, పెద్దమ్మ గుడి చైర్మన్ మహిపతి రామలింగం, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, ఉమర్, పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్ మూర్తి, ఎస్వీఆర్ కే ఆచార్యులు, పాల్వంచ పట్టణ అధ్యక్షులు రాజు గౌడ్, టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు సంకుబాపనా అనుదీప్, దిశా కమిటీ సభ్యులు పరంజ్యోతి రావు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు, డైరెక్టర్లు, టీబీజీకేస్ నాయకులు, వివిధ కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, బిఆర్ఎస్ పార్టీ వివిధ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, మరియు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.