గులాబీ పండుగగా బిఆర్ఎస్ ప్లినరి
- ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
-మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు
- బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు
తాండూర్ Tandur News : తాండూరు నియోజకవర్గంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ పార్టీ ప్లినరి నిర్వహించారు.ఈ సంధర్బంగా భారీగా తరలివచ్చిన గులాబీ సైనికులు,కళాకారుల ఆటాపాటలతో దద్దరిల్లిన సభా ప్రాంగణం.అనంతరం బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి,సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లికి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ప్లీనరీ సమావేశాన్ని ఘనంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు.ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరియు నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో వచ్చేది బిఆర్ఎస్.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మహిళలను ఉద్దేశించి మహిళ సాధికారత కోసం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్,మాతా శిశు సంరక్షణ కేంద్రాలు,స్త్రినిధి రుణాలు,ఒంటరి మహిళ పెన్షన్లు,ఆశ వర్కర్లకు జీతాలు పెంపు,మహిళ భద్రత కోసం షి టీమ్స్ ఏర్పాటు,ఈడబ్ల్యూఎస్ కోటా కింద మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్ల కల్పన, ఇలా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లి అయ్యి మళ్ళీ శిశువుకు జన్మనిచ్చే వరకు ప్రతి దశలో అమ్మ వలె, అన్న వలె, మేనమామ వలె కేసీఆర్ గారు అండగా నిలుస్తున్నడని పేర్కొన్నారు.
సభకు తరలివచ్చిన భారీ ప్రజలు
2001 ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భవించి, సీఎం కెసిఆర్ సార్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని, 2022 డిసెంబర్ 08వ తేదీన భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెంది, రానున్న రోజుల్లో జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ బలమైన శక్తిగా మారి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశమంతా ప్రవేశ పెట్టేలా,అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో దేశ రాజకీయాల్లో విజయవంతం కావాలని కోరారు.ముఖ్య మంత్రి వర్యులు కల్వకుంట్ల కేసీఅర్ గారు, చేసే అద్భుత పథకాలు ను, ఏర్పాటు చేసిన అన్ని రంగాలకు సంబంధించిన అనేక అద్భుత పథకాలు ప్రవేశపెట్టారు.
కళాకారుల ఆటాపాటలతో దద్దరిల్లిన సభ
పార్టీ ఆవిర్భవ సభ సందర్భంగా ఘాజీపూర్ ముద్దుబిడ్డ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షులు వెంకటేష్ చారి అన్నగారు గత పాలకుల వల్ల మన తాండూరుకు ఎంత అన్యాయం జరిగింది మన జిల్లాకు ఎంత అన్యాయం జరిగింది అని పూసగుచ్చినట్టు చెప్పడం చాలా సంతోషకరం గత పాలకులు స్థానికేతరులు కావడం వల్ల మన నియోజకవర్గముతో పాటు జిల్లాకు కూడా అన్యాయం చేసే ప్రయత్నం చేశారని మన దగ్గర మంచి రాజకీయ నైపుణ్యం కలిగిన సీనియర్ నాయకులను అణుగ తొక్కుతూ వచ్చిన సందర్భాలను గుర్తు చేశారు ఇట్లాంటి దుష్ట పాలకులను మళ్లీ తాండూరులో రానివ్వకుండా జాగ్రత్త పడాలని కోరారు జై తాండూర్ జై రోహిత్ అన్న అని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,ప్రజాప్రతినిధులు,మహిళలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.