రెడ్డిఘణపూర్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
బషీరాబాద్ Basheerabad News : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో రెడ్డిఘణపూర్ గ్రామ శివరిలోని గుర్తు తెలియని శవం కనిపించిన విషయంపై హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం మంగళవారం ఉదయం 10:00 గంటల సమయంలో రెడ్డి ఘనపూర్ గ్రామ శివారిలోని బలిజ శరణప్ప వ్యవసాయ పొలంలో ఒక గుర్తు తెలియని మృత దేహం కనిపించగా అట్టి మృత దేహంను రెడ్డి ఘనపూర్ గ్రామానికి చెందిన కుర్వకిరణ్ కుమార్ చూసి మంతటి వీఆర్ఎ అయినా సాదుల్లాకు తెలుపగా సాదుల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు.