ఏక్మాయి గ్రామ కార్యదర్శి గారిపై చర్యలు తీసుకోవాలి
* విద్యార్థులు ఆనారోగ్యనికి దారి
* ఇండ్ల మధ్యలో ఉన్నా పెంట కుప్పలు
* నీటి సమస్యలు పరిష్కరించాలి
బషీరాబాద్ Basheearabad News : బషీరాబాద్ మండలం ఏక్మాయి గ్రామములోని ఇండ్ల మధ్యలో ఉన్నాటు వంటి పెంట కుప్పలను ప్రభుత్వ ఆదేశాను సారము బయటికి తరలించుటను గూర్చిన మండల పరిషతి అభివృద్ధి అధికారి ఎంపిడిఓ రమేష్ గారికి విన్నపము చేశారు.గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు సమీపంలో మరియు ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి పెంటల మూలముగా గ్రామస్థులు మరియు పాఠశాల విద్యార్థులు (పిల్లలు) అనేక ఇబ్బందులను ఎదుర్కొనుచున్నారు. దాని వలన దోమలు, దుగ్గంధము వలన అనారోగాల పాలవుతున్నారు. ఇట్టి విషయంలో మేము విలేజి సెక్రెటరీ రవి గారి దృష్టికి తీసికవెళ్లిన ఫలితము లేదు.
తాండూర్ ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు చెప్పిన తీపిస్త అని తీయడం లేదు.ఎన్నో సార్లు ఈ సమస్యల పై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు అని ఎంపిడిఓ రమేష్ గారికి తెలిపారు.కావున గ్రామస్థుల ఇబ్బందులను మరియు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తమరు విలేజి సెక్రెటరీ రవి పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.ఇట్టి సమస్యల పై ఎంపిడిఓ రమేష్ గారు స్పందించి ఒక వారంలోగా గ్రామ సమస్యలను పరిష్కరిస్తాం అని తెలిపారు.ఈ కార్యక్రమాలలో కెవిపిఎస్ మండల అధ్యక్షులు సురేష్,రోహితన్న యూత్ అధ్యక్షుడు విజయ్ కుమార్,అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు సతీష్ కుమార్,వీరేశం,కాశీరాం,కమల్ కుమార్,విట్టల్,వెంకట్ తదితరులు పాల్కొన్నారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం లోని ఎక్మాయ్ గ్రామం లో అనేక సమస్యలతో బాద పడుతూనే వున్నారు ప్రతి రాజకీయ నాయకులు చెప్పటం మే కానీ ఏ పనులు సరిగా చెయ్యరు . మనిషి ఈ రోజు వుంటారు రెపు వుండరు కానీ మనం చేసే మంచి పనులు నిజం మారండి నాయకులు గారు సమాజానికి సేవ చెయ్యండి.
ReplyDelete