రేపు ప్లీనరీ సమావేశం విజయవంతం చేద్దాం
* మండలాల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు
* వార్డ్ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు
* ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
తాండూర్ Tandur News : తాండూర్ నియోజకవర్గం ఈ నెల 25వ తేదీ ఉదయం 10:00 గంటలకు యాలాల్ మండల్ లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా నందు నిర్వహించనున్నారు.బి.ఆర్.ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీని విజయవంతం చేద్దాం.గౌరవ పెద్దలు కెసీఆర్ గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ గారి ఆదేశాల మేరకు బి.ఆర్.ఎస్ పార్టీ ఆవీర్భావం తర్వాత సంప్రదాయంగా ప్రతీ ఏటా జరుపుకునే ప్లీనరీ ఈ సారి నియోజకవర్గంలో జరుపుకోనున్నాం.మండలానికి 800 మంది చొప్పున మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా 5000 వేల మందితో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ.25వ తేదీన ఉదయం 9:00 గంటలకు ప్రతీ గ్రామంలో మరియు వార్డుల్లో జెండా పండుగ నిర్వహించి సమావేశానికి బయల్దేరాలి.
ప్లీనరీలో క్రియాశీల కార్యకర్తలకు అవకాశం కల్పించాలి. ఇట్టి నియోజకవర్గ ప్లీనరీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిదులతో నిర్వహించబడుతుంది.పార్టీ లక్ష్యాలు, భవిష్యత్ కార్యచరణ, రాజకీయ పరిస్థితుల గురించి ప్లీనరీలో చర్చ జరుగుతుంది.ఇప్పటివరకు సాదించిన విజయాలు,నియోజకవర్గ, రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు సంబందించిన తీర్మాణాలు ఈ ప్లీనరీలో ఉంటాయి.
క్రమశిక్షణతో ఈ ప్లీనరీ సమావేశం జరుగుతుంది.నియోజకవర్గ స్థాయి ప్లీనరీకి ఒక్క రోజు సమయం ఉన్నందున ప్రతీ గ్రామంలో సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను ఆహ్వానించండి..అన్ని సామాజిక వర్గాలను ప్లీనరీలో భాగస్వామ్యం చేయాలి.ఏర్పాట్ల కమిటీ,బోజనాల కమిటీ,డెకరేషన్ కమిటీతో పాటు పలు కమిటీలు వేసి బాద్యత ఇవ్వటం జరుగుతుంది.బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో సాదించిన విజయాల పై,అన్ని కార్యక్రమాలపై ప్లీనరీలో తీర్మాణాలు చేయనున్నాం.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్లీనరీ సాక్షిగా ప్రజలకు తెలిపే విధంగా తీర్మాణం చేద్దాం.నియోజకవర్గ స్థాయిలో ప్రతీ గ్రామానికి నిదులు వచ్చాయి..ప్రతీ గ్రామంలో అభివృద్ది పనులు జరుగుతున్నయ్. పెండింగ్ లో ఉన్న పనులు మూడు నెలల్లో పూర్తి చేసుకుంటాం.చేసిన అభివృద్ధితో పాటు చేయాల్సిన పనుల గురించి గ్రామాల్లో చర్చ పెట్టండి.ఇట్టి ప్లీనరీ సమావేశంలో టౌన్ & అన్ని మండలాల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డ్ కమిటీ సభ్యులు మరియు గ్రామ కమిటీ సభ్యులు పాల్కొన్ననున్నారు.