Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అమిత్ షా CM KCRG PM's seat is not vacant Amit Shah

 

సీఎం కేసీఆర్‌ జీ... ప్రధాని సీటు ఖాళీగా లేదు అమిత్ షా

* తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
* భాజపాకు అవకాశమిస్తే రైతులను ఆదుకుంటాం
* ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కంటున్నారు


చేవెళ్ల chevella : చేవెళ్ల ప్రాంతంలో భాజపా పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజనలో భాగంగా చేవెళ్లలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో అమిత్‌ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రజల నుంచి సీఎం కేసీఆర్ దూరం చేయలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధాని అని స్పష్టం చేశారు. చేవెళ్లలో భాజపా నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. "ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కంటున్నారు. పీఎం సీటు ఖాళీగా లేదని ఆయన తెలుసుకోవాలి అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. కేసీఆర్ ముందు సీఎం సీటు కాపాడుకుంటే చాలు వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భాజపా సర్కారు వస్తుంది. భారీ మెజారిటీతో పార్టీని గెలిపించాలి" అని అమిత్ షా రాష్ట్ర ప్రజలను కోరారు.

కేసీఆర్‌ భారాస పేరుతో దేశమంతా విస్తరించాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కారు స్టీరింగ్‌ మజ్లీస్‌ చేతుల్లో ఉందని, మజ్లీస్‌కు భాజపా భయపడేది లేదని స్పష్టం చేశారు. మజ్లీస్‌కు భయపడే భారాస ప్రభుత్వం తెలంగాణ విమోచన దినం కూడా నిర్వహించట్లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రజల నుంచి సీఎం కేసీఆర్‌ దూరం చేయలేరని అన్నారు.




పేపర్‌ లీకేజీపై ప్రశ్నించిన బండి సంజయ్‌ను జైల్లో పెట్టారు. 24 గంటల్లో సంజయ్‌కు బెయిల్‌ వచ్చింది. ఈటల రాజేందర్‌ను అసెంబ్లీకి వెళ్లకుండా చేయాలనుకున్నారు. కానీ, వారికి సాధ్యం కాలేదు. టీఎస్‌పీఎస్సీ లీకేజీపై కేసీఆర్‌ ఒక్క మాట కూడా మాట్లాడరు. జైళ్లకు వెళ్లేందుకు భాజపా కార్యకర్తలు భయపడరు. మిమ్మల్ని గద్దె దించేవరకు మా కార్యకర్తలు విశ్రమించరు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే దొంగలను జైల్లో వేస్తాం కేసీఆర్‌కు మళ్లీ చెబుతున్నా మావాళ్లు జైళ్లకు భయపడరు. టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్లు లీకవుతున్నాయి. యువకుల జీవితాలతో కేసీఆర్‌ ఆటలాడుతున్నారు లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టారు. ఈ లీకేజీల ప్రభుత్వానికి కొనసాగే అర్హత ఉందా? టీఎస్‌పీఎస్సీ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. భాజపా అధికారంలోకి వస్తే దొంగలను జైల్లో వేస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను భారీ మెజార్టీతో గెలిపించాలి అని అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ ఒక్కసారి భాజపాకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.‘‘భాజపాకు అవకాశమిస్తే రైతులను ఆదుకుంటాం. ఉచిత విద్య, వైద్యం అందిస్తాం,ఉద్యోగులకు ఒకటో తేదీకే జీతాలు ఇస్తాం. ఇటీవల నన్ను అరెస్టు చేసి 8గంటల పాటు పోలీసులు రోడ్లపై  తిప్పారు. ఏ జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో దిల్లీ నుంచి ఫోన్‌ వచ్చిందని పోలీసులు కంగారు పడ్డారు. కార్యకర్తలను కాపాడే ఆ పులే ఈ రోజు చేవెళ్ల గడ్డపై అడుగు పెట్టింది. భాజపా తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది’’ అని బండి సంజయ్‌ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు లక్ష్మణ్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి,కార్యకర్తలు ప్రజలు తదితరులు సభకు హాజరయ్యారు.

మరిన్ని వార్తల కోసం.....  
* సీఎం కేసీఆర్‌ జీ ప్రధాని సీటు ఖాళీగా లేదు అమిత్ షా ఇక్కడ క్లిక్ చేయండి 
* చివరి అవకాశం మరో నాలుగు రోజులు పొడిగింపు ఇక్కడ క్లిక్ చేయండి 
* పీజీటీ ఉద్యోగాల్లో 76% మహిళలకే ఇక్కడ క్లిక్ చేయండి 
* ఫోన్ పోయిందా..ఇది తప్పక చదవాల్సిందే మరి ఇక్కడ క్లిక్ చేయండి


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies