ఎక్మాయి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
బషీరాబాద్ Basheerabad News : బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో మండల పరిషత్ పాఠశాల ప్రాంతంలో రెండో విడత కంటి వెలుగు నిర్వహించారు.కంటి వెలుగు అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ నెల 28 నుండి మే 12 వరకు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో డిఇఓ హరీశ్వర్ రెడ్డి,ఆటో రిఫ్రాక్టర్ కార్తీక్,మెడికల్ ఆఫీసర్ సురేష్ కుమార్,ఏఎన్ఎం సిస్టర్స్ కవిత,రాజేశ్వరి ఆశావర్కర్లు,సర్పంచ్ నారాయణ,వార్డ్ నెంబర్ వెంకట్ ప్రజలు తదితరులు పాల్కొన్నారు.