Type Here to Get Search Results !

Sports Ad

కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది....ప్రజలు జాగ్రత్తగా ఉండాలి A new virus is causing palpitations....people should be careful

కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది....ప్రజలు జాగ్రత్తగా ఉండాలి 

* వాతావరణంలో వచ్చే మార్పులు
* ప్రజలు మాస్కులు తప్పక ధరించాలి
* జ్వరం, శ్వాసకోశ సమస్యలు 
 

ఆరోగ్యం Health : ప్రజలు జాగ్రత్త ఉండాలని డాక్టర్లు సలహాలు సూచించారు.తెలుగు రాష్ట్రంలో పైరస్ మోగిస్తోంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. విశాఖలోని ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు.ఈ లక్షణాలతో పెద్దాసుపత్రితో పాటు,ప్రైవేట్ ఆసుపత్రులకు రోజూ వందల మంది వస్తున్నారు.దేశంలో వేగంగా వ్యాపిస్తోంది హెచ్3ఎన్ 2 వైరస్ ఈ మాయదారి రోగం తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. మొన్నటి వరకూ కరోనా ఇప్పుడు H3N2 వైరస్ తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే వేసవి తాపం మొదలైంది. ఇప్పుడు కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది. హాంగ్ కాంగ్ ఫ్లూ H3N2 వైరస్ ఈ పేరు చెప్తే ఇప్పుడు గుండెల్లో గుబులు రేపుతోంది.H3N2 వైరస్ కారణంగా సోకే ఇన్ఫ్లూయెంజానే హాంగ్కాంగ్ ఫ్లూ అంటున్నారు డాక్టర్లు. ఈ ఫ్లూ జ్వరం సోకి దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

అందులో ఒకరిది హర్యానా మరొకరిది కర్ణాటక మొదట్లో ఒకటి, రెండు కేసులే వచ్చినా మెల్లిగా చాపకింద నీరులా దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంద. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 90 మందిలో ఈ వైరస్ కేసులు నిర్ధారించారు.అదేవిధంగా ఎనిమిది H1N1 వైరస్ కేసులు కూడా నమోదయ్యాయి. సీజనల్ వ్యాధులకు సీజన్ కాదు మండుటెండకు స్వాగతం పలికే సమయం ఇలాంటి టైమ్లో ఫ్లూ జ్వరాలు దేశమంతటా పెరిగిపోతున్నాయి.

అందులో H3N2 వైరస్ కారణంగా వచ్చే ఫ్లూ జ్వరాలే ఎక్కువగా రెండు నెలలుగా ఈ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ హెచ్3 ఎన్2 రకం ఎఫెక్ట్ ఎక్కువ ఈ రోగం సోకితే దగ్గు, జ్వరం,ఒ శ్వాసకోశ ఇబ్బందులు, వికారం, వాంతులు,గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. విశాఖలోని ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలతో పెద్దాసుపత్రితో పాటు, ప్రైవేట్ ఆసుపత్రులకు రోజూ వందల మంది వస్తున్నారు.

 దీంతో అలెర్టయిన అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.హెచ్ 1 ఎన్1 వైరస్ వల్ల గతంలో ఒక మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది.ఇప్పుడు దానికి సంబంధించిన సాధారణ వేరియంటే హెచ్3 ఎన్2. ఇది ప్రస్తుతం దేశంపై విరుచుకుపడటంతో ఆందోళన మొదలైంది.ఇప్పటికే ఇద్దరిని పొట్టన పెట్టుకున్న మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ఒక్క ఉత్తరాంధ్రలోనే కాదు తెలంగాణ సహా దేశమంతా ఇదే పరిస్థితి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ ఫ్లూ జ్వరాలపై ఇవాళ సమావేశంలో చర్చించనున్నారు. కేసులు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. వాతావరణంలో వచ్చే మార్పులు ఒక కారణం అయితే రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించక పోవడం రెండవది.

H3N2 వైరస్ సోకితే కనీసం వారం రోజుల పాటు లక్షణాలు కనిపిస్తాయి. ఇక స్మోకింగ్, డ్రింకింగ్ ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువ వృద్ధులు, చిన్నారుల్లో మరింత ఎఫెక్ట్ సందర్భాల్లో న్యూమోనియాకు దారితీసే  ప్రమాదం కూడా ఉంది. ఈ వైరస్ సోకిన వారు పారాసిట్మాల్,బ్రుఫిన్ లాంటి టాబ్లెట్స్ వినియోగించవచ్చని వైద్యులు తెలిపారు.యాంటీ బయాటిక్స్ తో పటు ఓఆర్ఎస్,పండ్ల రసాలు ఎక్కువ నీళ్లు తీసుకోవాలని సలహాలు ఇచ్చారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies