ఘనంగా జరిగిన రంజాన్ వేడుకలు
తాండూర్ Tandur News : తాండూర్ పట్టణంలో రంజాన్ సందర్భంగా చెంగేస్ పూర్ రోడ్డు నందు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి,ఎమ్యెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అతిథులుగా పాల్కొన్నారు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ పరమతసహనాన్ని,మతసామరస్యాన్ని, ఆధ్యాత్మికతను చాటే పవిత్రమైన పండుగ రంజాన్ అని ఎమ్మెల్యే అన్నారు.మైనారిటీల అభివృద్ధికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్న పలు పథకాలు, ప్రగతి కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచాయని,వారి అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.ముస్లిం సోదర సోదరిమనులందరు ఆనందంగా,సంతోషంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని కోరుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారితో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ముస్లిం మత పెద్దలు,మైనారిటీ నాయకులు,ముఖ్య నాయకులు హాజరయ్యారు.