బషీరాబాద్ బిడ్డగా చెబుతున్నా చావైనా.. బతుకైనా..ప్రజల కోసమే
* బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మెళనం
* 40ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని ఏలిన నాయకులు ఏమి చేయలేదు
* అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు
* ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
బషీరాబాద్ Basheerabad News : శుక్రవారం రోజు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాశింపుర్ గ్రామంలో జరిగిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మెళనం నిర్వహించిన సంధర్బంగా భారీగా తరలివచ్చిన ప్రజలు.నేను బషీరాబాద్ బిడ్డను తాండూరు ప్రాంతానికి ఎన్ని నిధులైన తెచ్చి అభివృద్ధి చేస్తా అని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాశీంపూర్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మట్లాడుతూ 40ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని ఏలిన నాయకులు బషీరాబాద్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. సీఎం చొరవతో నియోజకవర్గానికి రూ.134కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ప్రతీ ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కె దక్కాలన్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని, గ్రామాల్లోకి ఆ నాయకులు వొస్తే తరమికొట్టాలన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ కుట్రను భగ్నం చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దేశవ్యాప్త గుర్తింపు వచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజుగౌడ్, ఎ.వెంకట్రాంరెడ్డి, జడల అన్నపూర్ణ, విజయలక్ష్మి,రామునాయక్, అశోక్ గౌతం, నర్సిరెడ్డి, కె.గోపాల్రెడ్డి, పాండురంగారెడ్డి, సర్పంచ్లు,ఎంపిటిసిలు,జెడ్పిటిసిలు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, ఆత్మీయులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం......
* బషీరాబాద్ బిడ్డగా చెబుతున్నా చావైనా.. బతుకైనా..ప్రజల కోసమే ఇక్కడ క్లిక్ చేయండి
* ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇక్కడ క్లిక్ చేయండి
* మధ్యతరగతి వాడి ఆవేదన ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రశ్నపత్రాలు ఎందుకు లీకవుతున్నాయి హైకోర్టు ఇక్కడ క్లిక్ చేయండి