Type Here to Get Search Results !

Sports Ad

ప్రశ్నపత్రాలు ఎందుకు లీకవుతున్నాయి హైకోర్టు Why are question papers leaking


 ప్రశ్నపత్రాలు ఎందుకు లీకవుతున్నాయి  హైకోర్టు 


హైదరాబాద్ HYDERABAD : తనపై నమోదైన పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకేజీ కేసు కొట్టివేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారని సంజయ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అర్ధరాత్రి అరెస్టు చేసి 150 కి. మీ తీసుకెళ్లారని తెలిపారు. మరోవైపు ఈ కేసులో సంజయ్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలున్నాయని ఏజీ ప్రసాద్ కోర్టు దృష్టికి తెచ్చారు. దర్యాప్తులో కీలకమైన మొబైల్ ను ఇవ్వట్లేదని చెప్పారు. ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి మార్చి 1 నుంచే కుట్ర జరిగిందని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయస్థానం గుజరాత్ సహా దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాలు ఎందుకు లీకవుతున్నాయని ప్రశ్నించింది. గతంలో ఒకటి రెండు  రాష్ట్రాల్లోనే ఈ తరహా ఘటనలు జరిగేవని వ్యాఖ్యానించింది. సంజయ్ పిటిషన్ పై ప్రభుత్వానికి, హెడ్మాస్టర్ కు నోటీసులు జారీ చేస్తూ విచారణను జూన్ 16కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తల కోసం...... 
* బషీరాబాద్ బిడ్డగా చెబుతున్నా చావైనా.. బతుకైనా..ప్రజల కోసమే ఇక్కడ క్లిక్ చేయండి 
* ఏప్రిల్‌ 25 నుంచి వేసవి సెలవులు ఇక్కడ క్లిక్ చేయండి 
* మధ్యతరగతి వాడి ఆవేదన ఇక్కడ క్లిక్ చేయండి 
* ప్రశ్నపత్రాలు ఎందుకు లీకవుతున్నాయి హైకోర్టు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies