హీరో రామ్‌చరణ్ అందరికి థాంక్స్...
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రామ్‌చరణ్-ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఈనెల 20న ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. శుక్రవారం ఆస్పత్రి నుంచి ఆమె డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా కథానాయకుడు రామ్‌చరణ్ Hero Ram charan మీడియాతో మాట్లాడారు. ఉపాసనకు చికిత్స అందించిన అపోలో వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.‘‘ఉపాసన, పాపను అపోలో వైద్యులు చాలా బాగా చూసుకున్నారు. వారికి పేరు పేరునా ధన్యవాదాలు.
ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వాళ్లు ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసిన అభిమానులకు థ్యాంక్స్. మీరు చూపిస్తున్న ప్రేమకు నాకు మాటలు రావడం లేదు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఒక తండ్రికి ఇంతకు మించిన వేరే ఆనందం ఏమీ ఉండదు. నాన్న (చిరంజీవి) కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బాబు/పాప ఎవరు పుట్టినా ఏ పేరు పెట్టాలనే విషయమై నేనూ ఉపాసన ముందే మాట్లాడుకున్నాం. అదేంటో ఇప్పుడే చెప్పలేను. పేరు పెట్టే రోజున నేనే స్వయంగా మీతో పంచుకుంటా’’ అని రామ్‌చరణ్ అన్నారు.