అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే పైలట్
రంగారెడ్డి Ranga Reddy News భారత్ ప్రతినిధి : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ప్రముఖ గాయకుడు సాయిచంద్ గారి అంతిమ యాత్రలో తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్కొన్నారు.తెలంగాణ మలిదశ ఉద్యమ నేత, గాయకుడు గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ గారు గుండెపోటుతో మృతి చెందటం చాలా బాధాకరం అని తెలిపారు.ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, సాయిచంద్ గారి కుటుంబ సభ్యులకు మనోధార్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ మృతదేహానికి అశ్రు నివాళులు అర్పించి వారి యొక్క అంతిమ యాత్రలో పాల్కొని పాడే మోశారు.ఈ యొక్క కార్యక్రమాలలో బీఆర్స్ కార్యకర్తలు తదితరులు పాల్కొన్నారు.
సాయిచంద్ భౌతిక కాయానికి నివాళులు మంత్రి కేటీఆర్
ప్రముఖ గాయకుడు సాయిచంద్ భౌతిక కాయానికి మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు.రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్ ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు.ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేటీఆర్ వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రసమయి బాలకిషన్, టీఎస్‌ఎమ్మెస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.అనంతరం మాట్లాడుతూ సాయిచంద్ అద్భుతమైన కళాకారుడని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారని వెల్లడించారు. సాయిచంద్ మరణం తీరని లోటని తెలిపారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.