తెలంగాణ 'గురుకుల' టీజీటీ ఫలితాల్లోచేశాయ్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ఎంతో మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టీజీటీ ఉద్యోగ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. ఆదివారం సాయంత్రం ఈ ఫలితాలను గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://treirb.cgg.gov.in/home లో ఉంచింది. గురుకులాల్లో 4,020 పోస్టులు ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ( టీజీటీ) పోస్టులకు గతేడాది ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితాలను విడుదల చేసింది. ప్రొవిజినల్ జాబితాలో ఉన్న హాల్‌టికెట్ నంబర్ కలిగిన అభ్యర్థులకు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ కింది తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించింది. సబ్జెక్టుల వారీగా ఎంపికైన వారి జాబితాలు ఇవే.
* టీజీటీ మ్యాథమెటిక్స్
* టీజీటీ బయాలజీ సైన్స్
* టీజీటీ జనరల్ సైన్స్
* టీజీటీ ఫిజికల్ సైన్స్
* సంస్కృతం
* తెలుగు
* సోషల్ స్టడీస్
* టీజీటీ ఉర్దూ
* టీజీటీ హిందీ
* టీజీటీ ఇంగ్లిష్



.webp)

