మార్చి 4 నుంచి డీఎస్సీ దరఖాస్తులు జిల్లాలవారీగా వివరాలు...!
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం ఫిబ్రవరి 29 సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ ఉద్యోగాలకు మార్చి 4వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఏప్రిల్ 2వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 878 పోస్టులు, రంగారెడ్డి జిల్లాలో 379 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
గద్వాల జిల్లాలో పోస్టులు: 172
ఆదిలాబాద్ జిల్లాలో పోస్టులు : 324
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోస్టులు : 447
హనుమకొండ జిల్లాలో పోస్టులు : 187
హైదరాబాద్ జిల్లాలో పోస్టులు : 878
జగిత్యాల జిల్లాలో పోస్టులు : 334
జనగాం జిల్లాలో పోస్టులు : 221
భూపాలపల్లి జిల్లాలో పోస్టులు : 237
కామారెడ్డి జిల్లాలో పోస్టులు : 506
కరీంనగర్ జిల్లాలో పోస్టులు : 245
ఖమ్మం జిల్లాలో పోస్టులు : 575
ఆసిఫాబాద్ జిల్లాలో పోస్టులు : 341
మహబూబాబాద్ జిల్లాలో పోస్టులు : 381
మహబూబ్‌నగర్ జిల్లాలో పోస్టులు : 243
మంచిర్యాల జిల్లాలో పోస్టులు : 288
మెదక్ జిల్లాలో పోస్టులు : 310
మేడ్చల్ జిల్లాలో పోస్టులు : 109
ములుగు జిల్లాలో పోస్టులు : 192
నాగర్‌కర్నూల్ జిల్లాలో పోస్టులు : 285
నల్లగొండ జిల్లాలో పోస్టులు : 605
నారాయణ్‌పేట్ జిల్లాలో పోస్టులు : 279
Nirmal జిల్లాలో పోస్టులు : 342
నిజామాబాద్ జిల్లాలో పోస్టులు : 601
పెద్దపల్లి జిల్లాలో పోస్టులు : 93
సిరిసిల్ల జిల్లాలో పోస్టులు : 151
రంగారెడ్డి జిల్లాలో పోస్టులు : 379
సంగారెడ్డి జిల్లాలో పోస్టులు : 551
సిద్దిపేట జిల్లాలో పోస్టులు : 311
సూర్యాపేట జిల్లాలో పోస్టులు : 386
వికారాబాద్ జిల్లాలో పోస్టులు: 359
వనపర్తి జిల్లాలో పోస్టులు : 152
వరంగల్ జిల్లాలో పోస్టులు : 301
యాదాద్రి జిల్లాలో పోస్టులు : 277





