Type Here to Get Search Results !

Sports Ad

పరీక్షకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం గాయాలతోనే పరీక్ష రాసిన విద్యార్థిని While going for the exam, the student got injured in a road accident


 పరీక్షకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం గాయాలతోనే పరీక్ష రాసిన విద్యార్థిని

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరుగుతు న్నాయి. నిమిషం నిబంధ నల వల్ల కొంత మంది విద్యార్థులు పరీక్ష రాయ లేకపోతున్నారు.ఈ నేపథ్యంలోనే పరీక్షా కేంద్రానికి ముందుగా వెళ్లా లన్న తొందరలో పలువురు విద్యార్థులు బైకుల మీద వెళ్తూ ప్రమాదానికి గురవు తున్నారు.ఈరోజు మార్చి 1న కూడా ఓ విద్యార్థిని పరీక్షకు వెళ్తూ ప్రమాదానికి గురైంది. ప్రమా దంలో విద్యార్థినికి తీవ్ర గాయాలవగా అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు మానవ త్వాన్ని చాటుకున్నాడు.అయితే.. తలకు అయిన తీవ్ర గాయంతోనే విద్యార్థిని పరీక్ష రాసేందుకు వెళ్లటం గమనార్హం. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ పరీక్ష రాసేందుకు నగరానికి చెంది న ఓ విద్యార్థిని తండ్రితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తోంది.అయితే.. సికిం ద్రాబాద్‌ ఎంజీ రోడ్‌ మార్గంలో ఉన్న ఓ కళాశాల వద్ద బండి అదుపుతప్పడంతో వాళ్లు కింద పడిపోయారు. 

   ఈ ప్రమాదంలో విద్యార్థిని తలకు తీవ్ర గాయాల య్యాయి.అక్కడే విధులు నిర్వహి స్తున్న మహంకాళి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉపాశంకర్‌.. ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే స్పందించారు. ఆ విద్యార్థి నిని తన వాహనంలోనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి.. ప్రథమ చికిత్స చేయించారు.ఆసుపత్రికి తీసుకెళ్లే ముందే.. ఆ విద్యార్థిని వెళ్లాల్సిన పరీక్షా కేంద్రంలోని ప్రిన్సిపల్‌కు ప్రమాద సమాచారం అందించి.. అనుమతి తీసుకున్నారు.కాగా విద్యార్థిని తలకు బలమైన గాయం కావ టంతో.. ఏడు కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత విద్యార్థినిని మళ్లీ తన వాహనంలోనే పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఉపా శంకర్. అది కూడా సరైన సమయానికే. ఆ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్‌ చేసిన సాయానికి విద్యార్థిని కృతజ్ఞతలు తెలిపింది. అంత బలమైన గాయం తగిలినా నొప్పి తోనే పరీక్ష రాసేందుకు వెళ్లింది విద్యార్థిని.

మరిన్ని వార్తల కోసం... 
* పరీక్షకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం గాయాలతోనే పరీక్ష రాసిన విద్యార్థిని ఇక్కడ క్లిక్ చేయండి 
* చలిజ్వరము లేదా మలేరియా దోమల ద్వారా వ్యాపించే ఒక రోగం ఇక్కడ క్లిక్ చేయండి 
* ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి 
* మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి 
* నేటి నుంచి సున్నా కరెంట్‌ బిల్లులు అమలు ఇక్కడ క్లిక్ చేయండి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies