Type Here to Get Search Results !

Sports Ad

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధం : సీఎస్ శాంతి కుమారి All set for Group 1 Preliminary Exam: CS Shanti Kumari

 గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధం : సీఎస్ శాంతి కుమారి   

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో గ్రూప్ -1 ప్రిలిమి నరీ పరీక్షలను రేపు సజావు గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు టిజిపి ఎస్‌సి చైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు.  31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రా ల్లో జరగనున్న ఈ పరీక్షలకు 4.03 లక్షల ఉద్యోగస్తులు విద్యార్థులు హాజరవుతున్నారని పేర్కొన్నారు.పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారి ని కూడా నోడల్ ఆఫీసర్‌గా నియమించినట్లు చెప్పారు. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్ కో ఆర్డినేటర్‌ను నియమించినట్లు తెలిపారు. బయోమెట్రిక్ ఇన్విజిలే టర్లకు శిక్షణ ఇచ్చేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవ డంతోపాటు ఏదైనా సమస్య తలెత్తితే తగిన సంఖ్యలో బయోమెట్రిక్ పరికరాలను కూడా అందు బాటులో ఉంచామన్నారు. 

       తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల ఏర్పాట్ల పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డా.బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుండి శుక్రవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లు,ఎస్‌సిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరు వుల సరఫరా, మిషన్ భగీరథ, గ్రామాల్లో ఇంటింటి సర్వే, జిల్లాల్లో పాఠశాలలకు స్కూల్ యూనిఫాంల పంపిణీ తదితర అంశాలను కూడా సి ఎస్  ప్రస్తావించా రు. జిల్లా కలెక్టర్లకు కూడా పరీక్షల ఏర్పాట్లపై తగిన ఆదేశాలు జారీ చేశామని, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయిందని సిఎస్ తెలిపారు. గ్రూప్- 1 పరీక్షలు ప్రశాం తంగా జరిగేలా పరిస్థితిని నిశితంగా పరిశీలించేందుకు జిల్లావ్యాప్తంగా పోలీసు, ఇతర అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.బ్లాక్ మార్కెటింగ్, విత్తనాల నిల్వలను అరికట్టడంలో సమర్థవంతమైన చర్యలు తీసుకున్నందుకు జిల్లాల కలెక్టర్లను ఆమె అభినందిం చారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies